తమిళనాడులో ఉగ్రవాదులు ప్రవేశించారనే సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం అనుమానం ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోయంబత్తూరులోని వివిధ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు కోయంబ్తతూరులో ప్రవేశించారని నిఘా వర్గాలకు శుక్రవారం సమాచారం అందింది. శ్రీలంక నుంచి సముద్ర మార్గం ద్వారా చొరబడ్డారని అధికారులు అనుమానిస్తున్నారు. తీరప్రాంత దళాలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోయంబత్తూరులో హై అలర్ట్ ప్రకటించారు.
రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, చర్చి, మసీదులు వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడే అవకాశాలున్నాయని, ఆ ప్రదేశాల్లో భద్రతా బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:'70 ఏళ్లలో కానిది 70 రోజుల్లో పూర్తి చేశాం'