సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్-చైనా దేశాలు చర్చలు జరుపుతున్నట్టు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పునరుద్ఘాటించారు. అయితే ఈ చర్చల్లో ఏం జరుగుతోందనేది మాత్రం రహస్యంతో కూడిన వ్యవహారమని పేర్కొన్నారు.
భారత్-చైనా మధ్య జరుగుతున్న చర్చలపై స్పష్టమైన జవాబు ఇవ్వాలని ఓ మీడియా సమవేశంలో అడగగా.. 'చర్చలు జరుగుతున్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించే ప్రక్రియ కొనసాగుతోంద'ని వెల్లడించారు జైశంకర్.
అదే సమయంలో.. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల మోహరింపు జరిగిందని అంగీకరించారు విదేశాంగమంత్రి.
"చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు.. ఇరు దేశాలకు అత్యంత రహస్యమైనవి. ఇప్పుడే నేను ఏ విషయాన్ని బహిరంగంగా చెప్పలేను. పరిస్థితులపై ముందుగానే ఓ అవగాహనకు రాలేను."
-- జైశంకర్, విదేశాంగమంత్రి.
టిబెట్‌లో పరిస్థితులపై ప్రశ్నించగా.. లద్దాఖ్‌తో సంబంధం లేని విషయాలపై మాట్లాడకూడదని అభిప్రాయపడ్డారు విదేశాంగమంత్రి.
ఇదీ చూడండి:- 'పాక్‌తో చర్చలా? అంతా అబద్ధం!'