పది, పన్నెండో తరగతి సీబీఎస్ఈ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమైన సందర్భంగా విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తూ ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎలాంటి ఒత్తిడి లేకుండా సంతోషంగా పరీక్షలు రాయాలని సూచించారు. కొన్ని నెలల కఠోర శ్రమకు తగ్గట్టుగా గొప్ప ఫలితాలు వస్తాయని ఆశించారు. విద్యార్థులను పరీక్షల వీరులుగా అభివర్ణించారు.
" సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి పరీక్షల సందర్భంగా యువ పరీక్ష వీరులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు. ఒత్తిడికి తావివ్వకుండా సంతోషంగా పరీక్షలు రాయాలని యువ స్నేహితులకు వినతి చేస్తున్నా. "
-ప్రధాని మోదీ ట్వీట్.
సీబీఎస్ఈ పరీక్షలకు మొత్తం 30లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో 18.89 లక్షల మంది పదో తరగతి చెందినవారుండగా, పన్నెండో తరగతికి చెందిన విద్యార్థులు 12.06లక్షల మంది ఉన్నారు.
ఇదీ చూడండి: దేశ సమస్యలపై దృష్టి పెట్టండి: శాస్త్రవేత్తలకు మోదీ పిలుపు