ETV Bharat / bharat

అటవీ ఏనుగుల మృతి ఘటనలపై కేంద్రం సీరియస్​ - elephant news

ఛత్తీస్​గఢ్​లో మృతి చెందిన రెండు అటవీ ఏనుగుల ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర అటవీ శాఖను ఆదేశించింది కేంద్రం. పూర్తి వివరాలను తక్షణమే అందించాలని కోరింది.

Take action in wild elephant deaths
అటవీ ఏనుగుల మృతిపై తగిన చర్యలు తీసుకోండి: కేంద్రం
author img

By

Published : Jun 11, 2020, 10:38 AM IST

ఇటీవల వెలుగు చూస్తోన్న అటవీ ఏనుగుల మృతి ఘటనలపై కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఛత్తీస్​గఢ్​లో రెండు అటవీ ఏనుగుల మృతికి కారణాలు తెలుసుకొని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర అటవీ శాఖను ఆదేశించింది కేంద్ర పర్యావరణ శాఖ. కేసులోని పూర్తి వివరాలను వెంటనే అందించాలని కోరింది.

రెండు రోజుల క్రితం ఛత్తీస్​గఢ్​లోని సూరజ్​పుర్​ జిల్లాలో రెండు అటవీ ఏనుగులు మృతి చెందాయి. అందులో ఒకటి గర్భంతో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టాలని కోరింది కేంద్రం.

''ఛత్తీస్​గఢ్​ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ ప్రధాన అధికారి.. ఏనుగులు మృతి చెందిన ఘటనాస్థలాన్ని సందర్శించి, ఆధారాలు సేకరించారు. సరైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ శాఖను కోరుతున్నాం. అదే విధంగా ఈ కేసులోని పూర్తి సమాచారాన్ని వెంటనే అందించాలి.''

- కేంద్ర పర్యావరణ శాఖ.

ఇదీ చూడండి: శిశువును పీక్కుతిన్న శునకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.