కర్ణాటక స్వతంత్ర ఎంపీ, సినీ నటి సుమలత అంబరీశ్... తన నియోజకవర్గం మండ్యలోని భాజపా కార్యాలయానికి వెళ్లడం చర్చనీయాంశమైంది. త్వరలో ఉపఎన్నికలు జరగనున్నవేళ ఆమె కమలదళంలో చేరతారన్న ఊహాగానాలకు తావిచ్చింది.
అయితే... అలాంటిదేమీ లేదని సుమలత స్పష్టంచేశారు. సార్వత్రిక ఎన్నికల్లో తనకు సహకరించిన భాజపా నేతలకు కృతజ్ఞతలు చెప్పేందుకే వచ్చినట్లు వివరించారు.
"మీకు(మీడియాకు) చెప్పకుండా నేను ఏ పార్టీలోనూ చేరను. అందులో దాయడానికి ఏముంది? నేను రహస్యంగా ఉంచగలనా? ముందు మీకే తెలుస్తుంది.
పార్టీలో చేరడంపై, ఉపఎన్నికల్లో ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వడంపై నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను.
గతంలో నేను బెంగళూరులోని భాజపా కార్యాలయానికి వెళ్లినప్పుడు కూడా ఇలాంటి ఊహాగానాలే వచ్చాయి. నేను ఇతర రాజకీయ నేతల్లా కాదు.-సుమలత, మండ్య ఎంపీ.
సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ను టికెట్ ఆశించి, భంగపడ్డ సుమలత... స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. భాజపా అభ్యర్థిని నిలపకుండా ఆమెకు మద్దతు ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై ఆమె లక్షా 25వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
ఇదీ చూడండి : గాలికి భయపడి అమెరికాలో కరెంట్ కట్