పౌరసత్వ సవరణ చట్టం అమలుపై కసరత్తు ఆరంభమైన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లే బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిందని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తెలిపింది.
జనవరి నెలలో తాము 268 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను నిర్బంధించగా.. వీరిలో ఎక్కువ మంది స్వదేశానికి తిరిగి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న వారే అని వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టంపై నిర్ణయం తీసుకున్న తర్వాత అక్రమ వలసదారుల్లో భయం ఏర్పడిందని పేర్కొంది.
పౌరసత్వ సవరణ చట్టాన్ని గత ఏడాది డిసెంబర్ 11న పార్లమెంటు ఆమోదించగా.. దాన్ని అమల్లోకి తెస్తూ కేంద్ర హోంశాఖ ఇటీవలే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇదీ చూడండి: భారత్లో కరోనా..! చైనా నుంచి వచ్చిన ఇద్దరికి పరీక్షలు