ETV Bharat / bharat

మాస్కుల్లో 3 పొరలు ఉంటేనే మేలు! - three layers masks

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే లాక్​డౌన్ సడలింపులు చేస్తూ వెళ్తోంది ప్రభుత్వం. బయటకు వెళ్తూనే కరోనా బారిన పడకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి. వీటిలో ప్రధానమైనది మాస్కులు ధరించడం. అయితే వివిధ వర్గాల ప్రజలు.. పలు రకాల మాస్కులను ధరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మాస్కులపై ప్రత్యేక కథనం.

masks
మాస్కుల్లో 3 పొరలు ఉంటేనే మేలు!
author img

By

Published : Jun 8, 2020, 7:35 AM IST

దేశంలో ఓవైపు కొవిడ్‌ కేసులు పెరుగుతుండగా.. మరోవైపు క్రమేపీ లాక్‌డౌన్‌ సడలింపులూ ఇస్తున్నారు. వాణిజ్య, రవాణా తదితర కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. రద్దీ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరికివారే తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీటిలో ప్రధానమైనది మాస్కులు ధరించడం. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం, వైద్య ఆరోగ్య సిబ్బంది ఎలాంటి మాస్కులు పెట్టుకోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? వంటి అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా చేసిన సూచనలివి..

mask
మాస్కు ఉండాలి ఇలా..

ఏ మాస్కు ఎవరికి?

మెడికల్‌ మాస్కులు

  • కొవిడ్‌ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న వారంతా సర్జికల్‌, ఎన్‌95 వంటి మెడికల్‌ మాస్కులు ధరించాలి. హృద్రోగ విభాగాలు, దీర్ఘకాలిక రోగుల సంరక్షణ కేంద్రాల్లో (కొవిడ్‌ నిర్ధారణ కాకపోయినా..) సేవలందించేవారు కూడా పెట్టుకోవాలి.
  • కొవిడ్‌ బారిన పడినవారూ మెడికల్‌ మాస్కులు ధరించాలి.
  • కరోనా సామాజిక వ్యాప్తి దశలో ఉన్న ప్రాంతాల్లో 60ఏళ్లు దాటిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు భౌతిక దూరాన్ని పాటించే వీల్లేనప్పుడు వీటిని పెట్టుకోవాలి.

సాధారణ మాస్కులు

  • కొవిడ్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లే సామాన్య ప్రజానీకం వీటిని ధరించాలి. ఉదా: బస్సులు, రైళ్లు, ఆటోలు వంటివాటిలో ప్రయాణిస్తున్నపుడు, దుకాణాల్లోనూ, రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడూ.
  • వీటిలో వస్త్రం తయారుచేసిన (ఫ్యాబ్రిక్‌/క్లాత్‌) మాస్కులు పెట్టుకోవచ్చు. ఇవి బయట కొన్నా.. ఇంట్లో తయారు చేసుకున్నా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
  • 3 పొరలు ఉండే మాస్కులే శ్రేయస్కరం.

ఎలా ధరించాలి?

mask
చేతులు శుభ్రంగా కడుక్కోవాలి..
  • ముందు చేతులను సబ్బు-నీళ్లతో (40-60 సెకన్లు) లేదా శానిటైజర్‌తో (20-30 సెకన్లు) శుభ్రం చేసుకోవాలి.
    mask
    మాస్కు ధరించాలి
  • మాస్కులకు మురికి, రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. నోరు, ముక్కు, గడ్డం ప్రాంతం పూర్తిగా కప్పిఉంచేలా ముఖానికి పెట్టుకోవాలి. ఎక్కడా ఖాళీలు ఉండకూడదు.
    mask
    మాస్కు కొసలనే పట్టుకోవాలి..
  • పెట్టుకునేటప్పుడు మాస్కు కొసలు మాత్రమే పట్టుకోవాలి. తర్వాత మాస్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదు. అనుకోకుండా తాకితే వెంటనే చేతులు శుభ్రం చేసుకోవాలి.

ఎలా తొలగించాలి?

  • మాస్కు ముందుభాగాన్ని తాకకుండా కొసలను పట్టుకుని తీయాలి. తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి.
    mask
    కొసలను పట్టుకునే మాస్కు తీయాలి..

ఇవి తప్పనిసరి..

mask
ఇవి తప్పనిసరి..
  • ఎవరి మాస్కును వారే వాడాలి. మరొకరికి ఇవ్వొద్దు, తీసుకోవద్దు.
  • ఫ్యాబ్రిక్‌/క్లాత్‌ మాస్కులను వినియోగించిన తర్వాత ప్రతిరోజూ సబ్బు, వేడి నీళ్లతో శుభ్రం చేయాలి.
  • మాస్కు పెట్టుకోవడమే కాకుండా.. భౌతిక దూరం పాటించడం, సబ్బు-నీళ్లు లేదా శానిటైజర్‌తో తరచూ చేతులు శుభ్రం చేసుకోవడమూ తప్పనిసరి. కొవిడ్‌ బారిన పడిన వారి నుంచి వెలువడే తుంపర్ల నుంచి మాస్కులు రక్షణ ఇస్తాయి.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రంలో 86శాతం దొంగ కరోనా కేసులే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.