ETV Bharat / bharat

'కోటా'లో పిల్లల మరణాలపై చర్యలు తీసుకోండి: ఓం బిర్లా - నెలరోజుల్లో 77 మంది నవజాత శిశువుల మరణం రాజస్థాన్

రాజస్థాన్​లోని కోటా ప్రభుత్వాస్పత్రిలో వారం వ్యవధిలో 12 మంది శిశువులు మరణించడం కలవరపెడుతోంది. ఈ ఏడాది 940 మంది మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశాన్ని సున్నితంగా పరిశీలించాలని లోక్​సభ స్పీకర్, స్థానిక ఎంపీ ఓం బిర్లా.. రాజస్థాన్​ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​ను కోరారు.

Spate of infants' death -- 12 in week and 77 in month -- in govt hospital rocks Kota
రాజస్థాన్​లోని కోటలో నవజాత శిశువుల మరణం
author img

By

Published : Dec 28, 2019, 9:13 AM IST

Updated : Dec 28, 2019, 12:13 PM IST

'కోటా'లో పిల్లల మరణాలపై చర్యలు తీసుకోండి: ఓం బిర్లా

రాజస్థాన్​ కోటాలోని జేకే లోన్ ప్రభుత్వాస్పత్రిలో వారం రోజుల వ్యవధిలో 12 మంది శిశువులు మరణించడం కలకలం రేపుతోంది. డిసెంబర్​ నెలలో 77 మంది... మొత్తంగా ఈ ఏడాది 940 మంది మృత్యువాతపడ్డారు. 23,24 తేదీల్లోనే ఏకంగా10 మంది మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పిల్లల మరణాలు సంభవిస్తున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.

ఆసుపత్రిపై వస్తోన్న ఆరోపణలపై స్పందించిన సిబ్బంది.. 'ఇది అసాధారణ విషయమేమీ కాదు' అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. శిశు మరణాలపై కోటా పార్లమెంట్ సభ్యుడు, లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలు బాధాకరమని తెలిపారు. సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​ను కోరారు. విషయాన్ని సున్నితంగా పరిశీలించాలని ట్విట్టర్​లో అభ్యర్థించారు ఓం బిర్లా.

వైద్య శాఖ దర్యాప్తు

విషయం తీవ్రం కావడం వల్ల గహ్లోత్ స్పందించారు. పరిస్థితులను తక్షణమే దగ్గరుండి పరిశీలించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వైభవ్ గలా​రియాను ఆదేశించారు. దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల ప్యానెల్​ 48 గంటల్లో నివేదిక సమర్పించాలని అధికారులను వైభవ్ ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నిర్లక్ష్యం కానే కాదు

న్యుమోనియా, ఆక్సిజన్ అందకపోవడం వంటి పలు కారణాలతో వీరు మృతిచెందినట్లు ఆస్పత్రి తన నివేదికలో పేర్కొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్క శిశువు మరణించలేదని సూపరింటెండెంట్ మీనా స్పష్టం చేశారు.

'పిల్లల మరణాలు సాధారణమే'

48 గంటల్లో 10 మంది శిశువులు మృతి చెందడంపై ఆస్పత్రి వైద్యుడు నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేశారు. ఘటన బాధాకరమని అయితే ఆస్పత్రిలో రోజుకు రెండు మూడు మరణాలు సాధారణమేనని శిశువైద్య విభాగం అధిపతి అమృత్ లాల్ భైరవ వ్యాఖ్యానించారు. ఇతర ఆస్పత్రుల నుంచి క్లిష్టమైన పరిస్థితుల్లో పిల్లలను ఆస్పత్రిని తీసుకొస్తున్నారని అన్నారు. శిశుమరణాలు 20 శాతం వరకు ఉంటే ఆమోదయోగ్యమేనని... కోటా ఆస్పత్రిలో 10-15 శాతం మధ్యే ఉన్నాయని, ఇదేమీ ఆందోళనకర విషయం కాదని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: 145 రోజులకు కార్గిల్​లో 'అంతర్జాలం'.. కశ్మీర్​లో ఎప్పుడు?

AP Video Delivery Log - 2100 GMT News
Friday, 27 December, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2057: Kazakhstan Plane Crash Survivor AP Clients Only 4246567
Survivor describes moment of Kazakh plane crash
AP-APTN-2051: Montenegro Lawmaker No access Montenegro 4246551
Jocic: Montenegro's shrines 'objects of trade'
AP-APTN-2005: US HI MIssing Helicopter 2 Must credit Hawaii DLNR 4246562
Terrain, weather hamper search for helicopter
AP-APTN-1958: Russia Weapon No access Russia; No use by Eurovision 4246561
Russia commissions hypersonic weapon
AP-APTN-1932: Russia Father Frost AP Clients Only 4246559
Father frosts bring festive cheer to Moscow
AP-APTN-1915: US KS Plant Explosion Must credit KAKE; No access Wichita; No use by US broadcast networks; No re-sale, re-use or archive 4246558
More than 12 hurt in Kansas factory explosion
AP-APTN-1909: Russia Doping AP Clients Only 4246557
RUSADA chief objects to appeal on Olympic ban
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Dec 28, 2019, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.