శత్రుఘ్న సిన్హా... బాలీవుడ్ షాట్‌గన్. కొద్దిరోజుల క్రితం వరకు భాజపా సభ్యుడు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ఈరోజు సమాజ్‌వాదీ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
భార్య కోసం...
శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్ సిన్హా... మంగళవారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. నేడు లఖ్‌నవూ స్థానానికి ఎస్పీ-బీఎస్పీ-ఆర్ఎల్డీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం భారీ రోడ్‌షో నిర్వహించారు. ఎస్పీ నేత డింపుల్ యాదవ్ సహా మరికొందరు పాల్గొన్న ఈ కార్యక్రమంలో... కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది.
లఖ్‌నవూ నుంచి భాజపా తరఫున కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పోటీ చేస్తున్నారు.
ఆజంగడ్ స్థానానికి అఖిలేశ్ నామినేషన్
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్ ఆజంగడ్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా హాజరయ్యారు. తన ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు అఖిలేశ్. ఆజంగడ్ను సమాజ్‌వాదీకి కర్మభూమిగా పేర్కొన్నారు.
ఇదీ చూడండీ: 'తీవ్రవాదులను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నాం'