ETV Bharat / bharat

'రాజకీయ ఒత్తిళ్ల వల్లే గంగూలీకి గుండెపోటు' - bengal latest news

రాజకీయ ఒత్తిళ్ల వల్లే గంగూలీ గుండెపోటుకు గురయ్యారని సీపీఐ(ఎం) సీనియర్​ నేత అశోక్​ భట్టాచార్య పేర్కొన్నారు. సౌరవ్​ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

Sourav under pressure to join politics; CPI(M) leader's comment triggers storm
'రాజకీయ ఒత్తిళ్ల వల్లే గంగూలీకి గుండెపోటు'
author img

By

Published : Jan 4, 2021, 10:53 AM IST

Updated : Jan 4, 2021, 12:05 PM IST

రాజకీయాల్లో చేరాలని వచ్చిన ఒత్తిళ్ల వల్లే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీకి గుండెనొప్పి వచ్చిందని.. సీపీఐ(ఎం) సీనియర్ నేత అశోక్​ భట్టాచార్య ఆరోపించారు. ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌరవ్​ను ఆయన పరామర్శించారు.

'మేము గంగూలీపై ఒత్తిడి పెంచడానికి రాలేదు. రాజకీయాల్లో చేరొద్దంటూ గత వారం ఆయనకు చెప్పాను. నా అభిప్రాయాలను సౌరవ్​ వ్యతిరేకించలేదు' అని భట్టాచార్య పేర్కొన్నారు.

బంగాల్​ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఈ మాజీ క్రికెటర్​ భాజపాలో చేరుతాడనే ఊహాగానాలు వచ్చాయి. రాజకీయల్లోకి రావడం గురించి గంగూలీ ఏనాడూ తన ఉద్దేశాన్ని ప్రకటించలేదు. కొంతమంది ఆయనను రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారు. బహుశా ఆ విషయం వల్లే ఒత్తిడి పెరిగిందేమో. సౌరవ్​ ఏనాటికి రాజకీయ అంశం కాదు..​ స్పోర్టింగ్ ఐకానే.

-అశోక్​ భట్టాచార్య, సీపీఐ(ఎం) సీనియర్​ నేత.

స్పందించిన భాజపా చీఫ్​..

'కొంతమంది తమ మందబుద్ధితో ప్రతీది రాజకీయాలకు ముడిపెడుతారు. లక్షల మంది అభిమానులు కోరుకుంటున్నట్లు గానే మేమూ.. సౌరవ్​ త్వరగా కోలుకోవాలనుకుంటున్నాం​' అని భట్టాచార్య వ్యాఖ్యలకు బదులుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ​స్పందించారు.

బంగాల్​ సీఎం మమతా బెనర్జీ, గవర్నర్​ జగ్దీప్​ ధన్కర్​లు సౌరవ్​ ఉన్న ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర మంత్రి ఛటర్జీ, మాజీ క్రికెటర్​ లక్ష్మీ కాంత్​ శుక్లా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్​ దాల్మియా కూతురు బైశాలి దాల్మియా, ఉత్తర్​ప్రదేశ్​ ఉప ముఖ్యమంత్రి కేవీ మౌర్యలతో పాటు పలువురు గంగూలీని పరామర్శించారు.

ఇదీ చదవండి: టీకాల తయారీలో కొత్త చరిత్రకు నాంది

Last Updated : Jan 4, 2021, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.