ETV Bharat / bharat

అమ్మ ప్రమాణం... ఫోన్​తో తనయుడి షూటింగ్

17వ లోక్​సభ సభ్యురాలిగా యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. రాయ్​బరేలీ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆమె హిందీలో ప్రమాణం చేశారు. ఈ దృశ్యాల్ని సోనియా తనయుడు రాహుల్ గాంధీ​ వీడియో తీశారు.

హిందీలో ప్రమాణం చేసిన సోనియా గాంధీ
author img

By

Published : Jun 18, 2019, 5:00 PM IST

యూపీఏ ఛైర్​పర్సన్ సోనియా గాంధీ లోక్​సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోరోజు పార్లమెంటు సమావేశాల్లో హిందీలో ప్రమాణం చేసిన ఆమెకు పలువురు భాజపా నేతలు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్​ నేతలు ఉత్సాహంతో బల్లలు చరిచారు. సోనియా ప్రమాణం చేసే దృశ్యాలను ఆమె తనయుడు, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ చరవాణిలో చిత్రీకరించారు.

సోనియాతోపాటు ఇవాళ భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మేనక, సోనియా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉత్తర్​ప్రదేశ్​ సుల్తాన్​పుర్​ నుంచి ఎంపీగా గెలుపొందారు మేనక.

ములాయం ప్రమాణం..

సమాజ్​వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కూడా ఈ రోజే ఎంపీగా ప్రమాణం చేశారు. అఖిలేష్ యాదవ్ ఆయనను చక్రాల కుర్చీలో తీసుకొచ్చారు.

17వ లోక్​సభ తొలి సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​, హోంమంత్రి అమిత్​షా తదితరులు మొదటిరోజు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు.

హిందీలో ప్రమాణం చేసిన సోనియా గాంధీ

ఇదీ చూడండి: స్పీకర్ ఓం బిర్లానే..! 10 పార్టీల మద్దతు

Intro:Body:

qw

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.