కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ.. తమ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, గల్వాన్ లోయలో ఉద్రిక్తతలు సహా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ విమర్శలు చేస్తూ వస్తోంది. లాక్డౌన్ అనంతరం వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తోంది. లద్దాఖ్ ఉద్రిక్తతలు, పేదలకు ఆర్థిక సాయం, చమురు ధరల పెరుగుదల అంశాలను కాంగ్రెస్.. పార్లమెంట్లో లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: ప్రధాని మోదీ ఓ అసత్యాగ్రహి: రాహుల్ గాంధీ