ETV Bharat / bharat

స్మృతి డిగ్రీలపై కాంగ్రెస్ పేరడీ పంచ్!

రాహుల్ గాంధీపై అమేఠి నుంచి రెండోసారి పోటీ చేస్తున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లక్ష్యంగా కాంగ్రెస్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టింది. విద్యార్హతలపై స్మృతి మాట పూటకో విధంగా మారుతోందని ఎద్దేవాచేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది. ఎన్నికల సంఘాన్ని, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ అవమాన పరుస్తున్నారని ఆరోపించారు.

author img

By

Published : Apr 12, 2019, 4:00 PM IST

స్మృతీ డిగ్రీలపై కాంగ్రెస్ పేరడీ పంచ్!

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విద్యార్హత మరో చర్చనీయాంశమైంది. ఎన్నికల ప్రమాణపత్రంలో ప్రతి ఎన్నికకో డిగ్రీ చదివానని అఫిడవిట్ ఇస్తూ... స్మృతి ఇటు ప్రజల్ని, అటు వ్యవస్థల్ని అవమానిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది దుయ్యబట్టారు. స్మృతీ ఇరానీ టీవీ ధారావాహిక... సాస్​ భీ కభీ బహూ థీ(అత్తా ఒకప్పటి కోడలే) గీతానికి పేరడీ కట్టి పాడి వినిపించారు ప్రియాంక. గత మూడు ఎన్నికల్లో ఎన్నికల కమిషన్​కు సమర్పించిన ప్రమాణపత్రంలో వేర్వేరు విద్యార్హతల్ని పొందుపరిచారని చెప్పారు.

త్వరలో 'క్యూంకీ మంత్రీ భీ కభీ గ్రాడ్యుయేట్​ థీ' అనే సీరియల్ వస్తోందంటూ స్మృతీ ఇరానీపై చతుర్వేది వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేరడీ పాట పాడి ఆశ్చర్యపరిచారు.

"2011లో బీఏ చదివానని పేర్కొన్న స్మృతి ఇరానీ... ఈసారి బీకామ్ చదివానని చెప్పారు. అందులోనూ విద్యాసంవత్సరం 1994కు మారిపోయింది. 2014 ఎన్నికల అఫిడవిట్​లో దిల్లీ యూనివర్శిటీ నుంచి 1994లో ఓపెన్ డిగ్రీ చదివానని పేర్కొన్నారు. ఇలా వేర్వేరు డిగ్రీలు సమర్పిస్తున్నారు. డిగ్రీల గురించి అడిగితే తన వద్ద యేల్ యూనివర్శిటీ డిగ్రీ కూడా ఉందంటున్నారు. ఈసారి అఫిడవిట్​లో అది సమర్పిస్తారనుకుంటే మాకు నిరాశే మిగిలింది. ఆమె గత నాలుగు అఫిడవిట్లలో వేర్వేరుగా విద్యార్హతలు ప్రకటించి దేశాన్ని, ప్రజలను మోసం చేశారు."
-ప్రియాంక చతుర్వేది

స్మృతీ డిగ్రీలపై కాంగ్రెస్ పేరడీ పంచ్!

పాట సాగుతుందిలా...

"క్వాలిఫికేషన్​ కే రూప్ బదల్తే హై... నయే నయే సాంచేమే ఢల్తే హై... ఏక్ డిగ్రీ ఆతీ హై... ఏక్ డిగ్రీ జాతీ హై... బన్తే అఫిడవిట్ నయే హై...(విద్యార్హతలకూ రూపం మారిపోతుంది... కొత్త కొత్త రూపాల్లో దర్శనమిస్తుంది... ఒక డిగ్రీ వస్తుంది. ఒక డిగ్రీ పోతుంది... ప్రమాణపత్రం కొత్తగా తయారవుతుంది)" అంటూ స్మృతీ ఇరానీని విమర్శిస్తూ వ్యంగ్యంగా పేరడీ పాట పాడారు.

Amritsar (Punjab), Apr 12 (ANI): Around 839 Sikh devotees from Punjab's Amritsar left for Gurdwara Panja Sahib in Pakistan. They are leaving to Pakistan for Baisakhi celebrations. They will go to Pakistan via special train.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.