ETV Bharat / bharat

40 రోజుల్లో అక్కడ 6 ఏనుగులు మృతి- ఏమైంది? - కావేరి అభయారణ్యం

కర్ణాటకలోని రెండు వణ్యప్రాణి అభయారణ్యాల్లో వరుసగా ఏనుగులు మరణిస్తుండటం పర్యావరణవేత్తలను ఆందోళనకు గురిచేస్తుంది. 40 రోజుల వ్యవధిలో ఆరు ఏనుగులు మృత్యువాతపడడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Six Elephants
ఏనుగుల మృతి
author img

By

Published : Apr 18, 2020, 4:53 PM IST

కర్ణాటకలోని రెండు వేర్వేరు వన్యప్రాణి అభయారణ్యాలలో 40 రోజుల వ్యవధిలో 6 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఇందులో 4 కావేరి అభయారణ్యంలో , మిగిలిన 2 మహదేశ్వరలో మరణించాయి.

వేర్వేరు కారణాలతో...

కర్ణాటక హనూరు తాలుకా దంతల్లిలో విద్యుదాఘాతంతో ఓ ఏనుగు మరణించింది. కందల్లిలో గర్భంతో ఉన్న మరో ఏనుగు బరువును తట్టుకోలేక గుంతలో పడింది. ఇంకొకటి బండరాయిని ఢీకొని ప్రాణాలు విడిచింది.

కొన్ని రోజుల క్రితం కావేరి అభయారణ్యంలో రెండు ఏనుగుల కళేబరాలు లభ్యమయ్యాయి. మహదేశ్వరలో మరొకటి దొరికింది. ఇలా 40 రోజుల కాలంలో ఆరు ఏనుగులు మృతిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: ఒడిశాలో 3 రోజులుగా కరోనా కేసులు '0​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.