ETV Bharat / bharat

వధూవరులకు వెండి 'మాస్క్'​ ఆభరణం!

సాధారణంగా పెళ్లింట.. అమ్మాయికి పది తులాల కాసులపేరు చేయించాం.. అబ్బాయికి రెండు తులాల గొలుసు చేయించాం అనే మాటలు వింటూంటాం. అయితే, ఇకపై వీటితో పాటు ఐదు తులాల మాస్కు చేయించామనే మాటలూ వినిపిస్తాయి. అవును, ఈ కరోనాకాలంలో వధూవరుల ధరించేందుకు.. స్పెషల్ వెండి​ మాస్క్​ ఆభరణాన్ని రూపొందించేశాడు మహారాష్ట్రకు చెందిన ఓ నగల వ్యాపారి.

Silver mask prepared in Kollapur
వధూవరులకు వెండి 'మాస్క్'​ ఆభరణం!
author img

By

Published : May 17, 2020, 10:43 AM IST

పెళ్లి రోజున వధూవరులు పట్టువస్త్రాలు ధరించి.. ఒంటి నిండా నగలు, పూలమాలలతో వైభవంగా ఉంటారు. ఈ కరోనాకాలంలో వీటితోపాటు మాస్క్​ తప్పనిసరిగా ధరిస్తున్నారు. అయితే, అంత అందంగా అలంకరించుకుని అందరిలానే సాధారణ మాస్కులు ధరిస్తే ఎలా? అందుకే, వారి దుస్తులకు మ్యాచ్​ అయ్యేలా ఓ అందమైన వెండి 'మాస్కాభరణం'​ తయారు చేశాడు మహారాష్ట్ర కల్హాపుర్​కు చెందిన నగర వ్యాపారి సందీప్​ సంగావకర్​.

వధూవరులకు వెండి 'మాస్క్'​ ఆభరణం!

కరోనా విజృంభణతో మానవాళి జీవితాల్లో మాస్కులు తప్పనిసరి అయ్యాయి. ఈ కాలంలో పెళ్లి చేసుకునే జంటలకు మాత్రం సాధారణ మాస్కులు కాకుండా కాస్త ప్రత్యేక మాస్క్​ను తయారు చేస్తే బాగుంటుందనుకున్నాడు సందీప్. అనుకున్నదే ఆలస్యంగా వైరస్​ నుంచి కాపాడే వినూత్న వెండి మాస్క్​ను రూపొందించేశాడు.

Silver mask prepared in Kollapur
వధూవరులకు వెండి 'మాస్క్'​ ఆభరణం!

ఒక్కోటి సుమారు 50 గ్రామలు బరువుండే.. ఆరు వెండి మాస్కులు తయారు చేశాడు సందీప్​.​ డిజైన్​ను బట్టి ఒక్కో మాస్క్​ ధర రూ.2,300-రూ.2600లుగా ఖరారు చేశాడు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​లో వలస కూలీల మరణ గాథ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.