ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్​ : ప్రసిద్ధ బౌద్ధ ఆలయం మూసివేత - -యెకోనా రాజేశ్​ మిశ్రా, ఆలయ నిర్వాహకులు

కరోనా వైరస్​ వ్యాప్తి భయంతో ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రసిద్ధిగాంచిన డెన్​ మహామన్​కోల్​ బుద్ధుడి ఆలయాన్ని మూసివేశారు. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు.

Shravasti Buddhist temple closed
కరోనా ఎఫెక్ట్​ : ప్రసిద్ధ బౌద్ధ ఆలయం మూసివేత
author img

By

Published : Feb 8, 2020, 3:49 PM IST

Updated : Feb 29, 2020, 3:38 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ శ్రవస్తి జిల్లాలోని చారిత్రక డెన్​ మహామన్​కోల్​ బౌద్ధ మందిరాన్ని మూసివేశారు. ప్రపంవ్యాప్తంగా రాకాసి కరోనా వైరస్​ వ్యాపిస్తోన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు ఆలయ నిర్వాహకులు. ఆలయం బయట ఓ బోర్డును కూడా తగిలించారు.

నిత్యం వేలాదిమంది బౌద్ధ భక్తులు, విదేశి పర్యటకులతో నిత్యం కళకళలాడుతూ ఉండే ఈ మందిరాన్ని మూసివేయడం వల్ల గ్రామమంతా వెలవెలబోయింది. ఈ మందిరానికి చైనా, జపాన్​, శ్రీలంక, మయన్మార్​, బర్మా, థాయ్​లాండ్​ నుంచి వేలాది మంది పర్యటకలు వస్తుంటారు.

"ఈ చారిత్రక డెన్​ మాహామన్​కోల్​ బౌద్ధ ఆలయానికి వేలాది మంది పర్యటకులు వస్తుంటారు. విదేశీ సంస్థలు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాపిస్తోన్న నేపథ్యంలో ఈ ఆలయాన్ని మూసివేశాం."

-యెకోనా రాజేశ్​ మిశ్రా, ఆలయ నిర్వాహకులు

కరోనా వైరస్​ తగ్గుముఖం పట్టిన వెంటనే ఆలయాన్ని తెరుస్తామని ప్రకటించారు ఆలయ నిర్వాహకులు.

ఇదీ చూడండి : దిల్లీ దంగల్​: ఆప్​- కాంగ్రెస్ నేతల మధ్య ఫైటింగ్

Last Updated : Feb 29, 2020, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.