ETV Bharat / bharat

పులులను హింసించారు-ఉద్యోగాలు పోగొట్టుకున్నారు - TIGER VIDEO

సఫారీ పార్క్​ అంటే జంతువులను దగ్గర నుంచి చూసేందుకు ఉండే సదుపాయం. అయితే ఛత్తీస్​గఢ్​లో ఓ సఫారీ పార్క్​లో అక్కడి జంతువులను మరీ దగ్గరగా రప్పించి వాటిని హింసించారు కొంత మంది సిబ్బంది. ఈ తతంగమంతా వారే ఫోన్లో చిత్రీకరించగా.. అది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూగజీవులను హింసించినందుకు ముగ్గురు జూ సిబ్బందిపై అటవీ శాఖ వేటు వేసింది.

raipur jungle safari viral video
సఫారీ పులి వీడియో
author img

By

Published : Feb 18, 2020, 7:41 AM IST

Updated : Mar 1, 2020, 4:48 PM IST

పులులను హింసించారు-ఉద్యోగాలు పోగొట్టుకున్నారు

ఛత్తీస్​గఢ్​లోని ఓ సఫారీ పార్క్​ సిబ్బంది పులులను హింసిస్తూ చిత్రీకరించిన ఓ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నయా రాయ్​పుర్​లో ఉన్న జంగిల్​ సఫారీ పార్క్​లో జరిగింది ఈ ఘటన. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి పులులను హింసించినందుకు ముగ్గురు సిబ్బందిని ఉద్యోగం నుంచి తప్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది..

ఇటీవలే ఓ టూరిస్టు బస్సు సఫారీ పార్క్​లో తిరుగుతున్న సమయంలో.. ఆ వాహనం కిటికీ నుంచి ఓ గుడ్డముక్క బయటకు వేళాడింది. దాన్ని చూసిన ఓ పులి ఆ గుడ్డను నోటితో పట్టుకునేందుకు ప్రయత్నించింది. వాహనంలో ఉన్న సిబ్బంది ఆ పులిని రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. వారిని ఆపాల్సిన గైడ్​.. ఆ దృశ్యాలను ఫోన్​లో చిత్రీకరించాడు.

అదే సమయంలో మరో పులి అక్కడకు వచ్చింది. వాహనంలో ఉన్న వారు అరుస్తుండటం వల్ల ఆ పులులకు ఏం జరుగుతుందో ఆర్థం కాలేదు. ఫలితంగా ఒక దానిపై ఒకటి దాడికి దిగాయి. అనంతరం ఓ పులి కొద్ది సేపు బస్సు వెనకాలే పరిగెట్టింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు.. బస్సులో ఉన్న ఇద్దరు గైడ్​లు సహా డ్రైవర్​ను విధుల నుంచి తప్పించింది.

ఇదీ చూడండి:ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

Last Updated : Mar 1, 2020, 4:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.