మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తమకు మూడు రోజుల గడువు ఇవ్వలేదన్న వాదనపై శివసేన వెనక్కి తగ్గింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసేందుకు నిరాకరించింది.
గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంలో మంగళవారమే పిటిషన్ దాఖలు చేసింది శివసేన. గవర్నర్ తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21లకు వ్యతిరేకంగా ఉన్నట్లు పిటిషన్లో పేర్కొంది. ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది.
శివసేన అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీం.. బుధవారం ఉదయం 10.30 గంటలకు రిట్ పిటిషన్ దాఖలు చేయమని మంగళవారమే సూచించింది. శివసేన మాత్రం వెనకడుగేసింది.
అయితే... మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకంగా వేయనున్న పిటిషన్ సిద్ధంగా ఉన్నట్లు శివసేన న్యాయవాది ఫెర్నాండెజ్ స్పష్టం చేశారు.