ETV Bharat / bharat

మోదీ జీ అలా చేయొద్దు- ట్రెండింగ్​లో '#నో సర్' - తాజా వార్తలు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీని సామాజిక మీడియాను వీడొద్దంటూ విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాలను వదిలేయాలనుకుంటున్నానని మోదీ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే '#నో సర్' ట్రెండింగ్​లోకి వచ్చింది.

Several netizens urge PM not to quit social media, 'No Sir' trends on Twitter
మోదీ జీ అలా చేయొద్దు- ట్రెండింగ్​లో '#నో సర్'
author img

By

Published : Mar 3, 2020, 6:01 AM IST

Updated : Mar 3, 2020, 8:47 AM IST

మోదీ జీ అలా చేయొద్దు- ట్రెండింగ్​లో '#నో సర్'

సామాజిక మాధ్యమాలను వీడే యోచనలో ఉన్నట్లు మోదీ నిన్న ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే '#నో సర్' ట్రెండింగ్​లోకి వచ్చింది. సోషల్​ మీడియాను వీడొద్దంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.

అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టేస్తూ సోమవారం సంచలన విషయాన్ని వెల్లడించారు మోదీ. సామాజిక మీడియాను వీడే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

  • This Sunday, thinking of giving up my social media accounts on Facebook, Twitter, Instagram & YouTube. Will keep you all posted.

    — Narendra Modi (@narendramodi) March 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఫేస్​బుక్​, ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్​, యూట్యూబ్​ల్లోని నా ఖాతాలను విడిచిపెట్టాలని భావిస్తున్నాను" అని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

మంగళవారం ఉదయానికి ఈ ట్వీట్​ 38,900 సార్లు రీట్వీట్​ అయింది. కనీసం నిమిషానికి ఒకరు కామెంట్​ పెడుతున్నారు.

చాలా మంది మోదీ అభిమానులు సోషల్​ మీడియాను వీడొద్దంటూ ట్విట్టర్​ వేదికగా విజ్ఞప్తులు చేస్తున్నారు.

Several netizens urge PM not to quit social media, 'No Sir' trends on Twitter
మోదీ జీ అలా చేయొద్దు- ట్రెండింగ్​లో '#నో సర్'

"మోదీ జీ.. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మిమ్మల్ని ప్రేమిస్తారు. కావాలంటే సోషల్​ మీడియా నుంచి విరామం తీసుకోండి. కానీ తిరిగి రండి." - మోదీ అభిమాని

"నేను నరేంద్ర మోదీ అభిమానిని. ఆయన వదిలేస్తే.. నేను సోషల్​ మీడియా జోలికి వెళ్లను."- ఓ ట్విట్టర్​ వినియోగదారుడు

సోషల్​ మీడియా రారాజు...

ప్రధాని మోదీని ట్విట్టర్‌లో 5.33 కోట్ల మంది, ఫేస్‌బుక్‌లో 4.4 కోట్ల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 3.52 కోట్ల మంది, యూట్యూబ్‌లో 4.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

Last Updated : Mar 3, 2020, 8:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.