నెరవేర్చవలసిన విధులను యువత చిత్తశుద్ధితో పాటించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. విధులను పాటించడం ద్వారా నవభారతం సాకారమవుతుందని గణతంత్ర కవాతులో పాల్గొననున్న ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన కార్యక్రమం వేదికగా వ్యాఖ్యానించారు. భౌగోళిక, సామాజిక విభిన్నత భారత గొప్పతనమన్నారు. ఎవరిని, ఏ ప్రాంతాన్ని భారత్ విస్మరించలేదని చాటి చెప్పడమే గణతంత్ర కవాతు ప్రధాన ఉద్దేశమని తెలిపారు మోదీ.
"ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ద్వారా క్రమశిక్షణ, సేవా భావనలను రాజ్‌పథ్‌లో మీరు ప్రదర్శించినప్పుడు దేశంలోని కోట్లమంది యువతకు స్ఫూర్తి, ప్రోత్సాహాలు లభిస్తాయి. దేశంలోని కళలు, భారత విశిష్టతను ప్రదర్శించే శకటాలతో మీరు రాజ్‌పథ్‌లో ప్రదర్శన చేసే సమయంలో ప్రపంచం మంత్రముగ్ధమై చూస్తుంది. మీరంతా దేశంలోని భిన్నత్వాన్ని దిల్లీకి తీసుకువచ్చారు. దిల్లీలోని భిన్నత్వాన్ని మీ రాష్ట్రాలకు తీసుకెళతారు. మీరంతా 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ అనే' భావనను సాకారం చేస్తారు."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
ఇదీ చూడండి: 'ప్రభుత్వ పరిపాలనకు రాజ్యాంగమే పవిత్రగ్రంథం'