ETV Bharat / bharat

సజావుగా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ - ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 260 మంది అభ్యర్థులు 20 అసెంబ్లీ స్థానాల కోసం పోటీపడుతున్నారు. నక్సల్ దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.

Second phase of polling begins in 20 Jharkhand seats
సజావుగా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్
author img

By

Published : Dec 7, 2019, 8:55 AM IST

Updated : Dec 7, 2019, 9:05 AM IST

సజావుగా ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్

ఝార్ఖండ్​ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రారంభమైంది. 20 అసెంబ్లీ స్థానాలకుగాను 260 మంది పోటీపడుతున్నారు. 47 లక్షల మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఝార్ఖండ్​లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు 5 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

రెండో దశలోని మొత్తం 20 స్థానాలకు గాను 18 నియోజకవర్గాల్లో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి 3 గంటల వరకు జరగనుంది. జంషెడ్​పుర్​​(తూర్పు), జంషెడ్​పుర్​ (పశ్చిమ) అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు సాగుతుందని ఎన్నికల సంఘం​ స్పష్టం చేసింది.

మొత్తం 6,066 పోలింగ్ కేంద్రాల్లో 949 (అత్యంత క్లిష్టమైనవి), నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోని 762 (సున్నితమైనవి)గా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో 42 వేల మంది పోలీసులతో పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు.

బరిలో ప్రముఖులు..

ముఖ్యమంత్రి రఘుబర్‌ దాస్‌, శాసనసభ స్పీకర్‌ దినేష్‌ ఓరాన్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ గిలువా లాంటి ప్రముఖులు రెండో విడత ఎన్నికల బరిలో ఉన్నారు. రఘుబర్‌ దాస్‌.. జంషెడ్​పుర్ తూర్పు స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.

5 దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో తొలి దఫా 13 స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ ముగిసింది. 3,4,5 దశల పోలింగ్​ డిసెంబర్​ 12, 16, 20 తేదీల్లో జరుగుతుంది. 23న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: నేరగాళ్లకు సింహ స్వప్నాలు.. ఈ ఎన్‌కౌంటర్‌ నిపుణులు

Mumbai, Dec 07 (ANI): The much awaited historical movie 'Panipat' got released on December 06. The movie stars Arjun Kapoor and Kriti Sanon in lead roles. Arjun is playing the role of Sadashivrao Bhau, while Kriti will be seen as Parvati Bai in the movie. While speaking to media about the movie, one of the moviegoers said, "Overall it was a good experience and movie is worth the money. If you are getting bored at home then you can come to the cinema halls and watch this film." Another moviegoer added, "Action scene in the movie is really good and last 25 minutes almost saved the movie." The movie also stars Sanjay Dutt and Zeenat Aman in pivotal roles. The movie is directed by Ashutosh Gowariker.
Last Updated : Dec 7, 2019, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.