తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు పాఠశాలల పునఃప్రారంభంపై తమిళనాడు ప్రభుత్వం వెనక్కుతగ్గింది. 9-12 తరగతులకు నవంబర్ 16 నుంచి పాఠశాలలు తెరవాలని తొలుత ప్రకటించినా.. మరికొంత కాలం మూసిఉంచాలని తాజాగా నిర్ణయించింది.
అయితే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సాంకేతిక కోర్సులు డిసెంబర్ 2 నుంచి ప్రారంభంకానున్నాయి. కళాశాల విద్యార్థుల కోసం వచ్చే నెల నుంచి హాస్టళ్లను తెరుస్తామని ప్రభుత్వం తెలిపింది.
తల్లిదండ్రుల విముఖత..
తరగతుల పునఃప్రారంభంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో తమిళనాడు సర్కారు సంప్రదింపులు జరిపింది. కొంతమంది పాఠశాలల ప్రారంభానికి అనుకూలమని చెప్పగా.. చాలా మంది వ్యతిరేకించారు.
ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. 2021 జనవరి తర్వాత పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
ఇదీ చూడండి: బడి పిల్లలకు కరోనా గండం- తల్లిదండ్రుల్లో ఆందోళన