ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దేశ ద్రోహం కేసులో తనను హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ వినోద్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం సానుకూలంగా స్పందించింది. ఆదివారం జరిపిన అత్యవసర విచారణలో ఈ మేరకు జులై 6 వరకు వినోద్‌ను అరెస్టు చేయకూడదని పోలీసులను ఆదేశించింది.
అయితే దర్యాప్తుపై స్టే విధించాలన్న వినోద్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దర్యాప్తుకు సహకరించాలని స్పష్టం చేసింది. ఈ విషయంపై రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎమ్ఎమ్ శాంతనగౌదర్‌లతో కూడిన ధర్మాసనం. తదుపరి విచారణను జులై 6కు వాయిదా వేసింది.
వినోద్ నిర్వహించిన ఓ యూట్యూబ్ కార్యక్రమం ఆధారంగా ఆయనపై గతంలో హిమాచల్‌ప్రదేశ్ పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదుచేశారు.
ఇదీ చూడండి:- అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్ కొనసాగింపు