ETV Bharat / bharat

'మైనారిటీ' పిల్​పై కేంద్రానికి సుప్రీం నోటీసులు - 10 రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీల జాబితాలో కొనసాగింపు

దేశంలో మైనార్టీలు ఎవరో గుర్తించే పద్ధతిని మార్చాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని.. శుక్రవారం విచారించింది సుప్రీంకోర్టు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.

SC notice to Centre on PILto frame guidelines for identifying minorities at state level
మైనారిటీల జాబితా విషయంలో కేంద్రానికి సుప్రీం నోటీసులు
author img

By

Published : Aug 28, 2020, 3:58 PM IST

మైనార్టీలను జాతీయ స్థాయి గణాంకాల ఆధారంగా కాకుండా రాష్ట్ర స్థాయి గణాంకాల ప్రకారం గుర్తించాలని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై శుక్రవారం(ఆగస్టు 28న) విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. మైనార్టీలను గుర్తించేందుకు రాష్ట్ర స్థాయిలో కేంద్రం రూపొందించిన విధి విధానాలను తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ, న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖలకు నోటీసులు జారీ చేసింది.

వ్యాజ్యం దాఖలు చేసిన భాజపా నేత, న్యాయవాది అశ్వినీకుమార్​ ఉపాధ్యాయ.. దాదాపు 10 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నట్లు ఆ పిల్​లో పేర్కొన్నారు. అయితే వారిని మైనార్టీలుగా ప్రకటించలేదని ఆయన కోర్టుకు తెలిపారు.

ఇదీ వాదన...

ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలను మైనార్టీలుగా గుర్తిస్తూ 26 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. దాన్ని సవాలు చేస్తూ 'మైనార్టీ' అనే పదాన్ని రాష్ట్రస్థాయి జనాభా ఆధారంగా నిర్వచించాలని అశ్వినీకుమార్​ పిటిషన్​ దాఖలు చేశారు. జాతీయ మైనార్టీ విద్యా సంస్థ చట్టం 2004లోని సెక్షన్ 2 చెల్లుబాటును ఆయన సవాలు చేశారు. ఈ విషయంలో కేంద్రానికి విశేష అధికారులు ఇవ్వటం, ఏకపక్షంగా, అహేతుకంగా ఉందని పేర్కొన్నారు.

జాతీయ స్థాయి గణాంకాల ఆధారంగా మెజార్టీగా ఉన్న హిందువులు.. కొన్ని ఈశాన్య రాష్ట్రాలతో పాటు, జమ్ముకశ్మీర్​లో మైనార్టీలుగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు పిటిషనర్​. ఆయా రాష్ట్రాల్లో హిందువులకు మైనార్టీలకు అందాల్సిన ప్రయోజనాలు లభించడం లేదని తెలిపారు. 2011 ప్రభుత్వ జనాభా లెక్కల ప్రకారం.. 8 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్న విషయం తెలిసిందే.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.