మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మరింత గడువు పొడిగించాలని చేసిన విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేనకు నిరాశ తప్పలేదు. శివసేన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
"బుధవారం 10.30 గంటలకు రిట్ పిటిషన్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు శివసేనకు సూచించింది."
- సునీల్ ఫెర్నాండెజ్, శివసేన న్యాయవ్యాది
రాష్ట్రపతి పాలనపైనా
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని కూడా సవాల్ చేయాలని శివసేన నిర్ణయించింది. ఈ పిటిషన్‌ను ఎప్పుడు దాఖలు చేయాలో బుధవారం నిర్ణయిస్తామని సునీల్ తెలిపారు.
చివరికి ఇలా జరిగింది..
ప్రభుత్వ ఏర్పాటుకు మూడు రోజులు సమయం కావాలని శివసేన గవర్నర్ భగత్ కోశ్యారీని అభ్యర్థించింది. అయితే అందుకు నిరాకరించిన గవర్నర్ సోమవారం రాత్రి ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతికి లేఖ పంపించారు. ఫలితంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ రామ్‌నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారు. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: హెలికాప్టర్ రేస్‌లో టాటా, మహీంద్రా, అదానీ... గెలుపు ఎవరిది?