నిర్భయ దోషులు అవయవదానం చేసేందుకు వీలు కల్పించేలా తిహార్ జైలు అధికారులకు ఆదేశాలిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ మేరకు బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది ధర్మాసనం. వైద్య పరిశోధనలతో పాటు ఇతరులకు తమ అవయవాలు దానం చేసేందుకు దోషులకు అవకాశమివ్వాలన్న న్యాయమూర్తి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అవయవదానం చేయాలా వద్దా అన్న అంశం దోషులకు సంబంధించిన విషయమని స్పష్టం చేసింది.
"ఓ పిటిషన్ ద్వారా మీరు ఇలాంటి ఆదేశాలివ్వాలని కోరకూడదు. ఒకవేళ దోషులకు అవయవదానం చేయాలని ఉంటే.. ఆ విషయాన్ని స్వయంగానో లేదా తమ కుటుంబసభ్యుల ద్వారానో వారే తెలియజేస్తారు. ఓ వ్యక్తిని తమ నుంచి దూరం చేయడం సదరు కుటుంబసభ్యులకు ఎంతో బాధ కలిగిస్తుంది. కానీ మీరు వారి శరీరాన్ని ముక్కలుగా చేయాలని కోరుతున్నారు."
- సుప్రీంకోర్టు
ఇదీ చదవండి: నిర్భయ దోషుల ఉరిపై వీడని ఉత్కంఠ.. మరోమారు స్టే