ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్యామ్ పిట్రోడా. రాజీవ్ గాంధీపై ప్రధాని అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. మోదీ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. ప్రధాని హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు.
" రాజీవ్ గాంధీపై ప్రధాని వ్యాఖ్యలు బాధ కలిగించాయి. సాధారణంగా దేశ ప్రధాని ప్రజల గురించి మాట్లాడుతారు. అది అతని పెద్ద బాధ్యత కూడా. ప్రధాని తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదు. కానీ నిన్న రాహుల్ గాంధీని సూచిస్తూ మీ తండ్రి చనిపోక ముందు నంబర్ వన్ అవినీతిపరుడు అని పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఆ ప్రకటనకు సిగ్గుపడుతున్నాం. నేనూ గుజరాతీనే. గాంధీ పుట్టిన రాష్ట్రం నుంచే వచ్చాను. మోదీ గుజరాతీ అయిఉండి అబద్ధాలు, అల్పమైన విషయాలు మాట్లాడటం చూసి నేను ఆశ్చర్యానికి గురయ్యా. " - శ్యామ్ పిట్రోడా, కాంగ్రెస్ విదేశీ విభాగం బాధ్యుడు
ఓడిపోతామని నిరాశతోనే..
ఎన్నికల్లో ఓడిపోతామనే నిరాశతోనే రాజీవ్ గాంధీపై ప్రధాని మోదీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం. చనిపోయినవారి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటమేంటని ప్రశ్నించారు. ఏ మతమూ ఇలాంటివి అంగీకరించదన్నారు.
ఇదీ చూడండి: భాజపాది బూటకపు జాతీయవాదం: బఘేల్