ETV Bharat / bharat

రాజస్థాన్​: అసెంబ్లీ నిర్వహణపై గహ్లోత్​కు మళ్లీ చిక్కు - అశోక్​ గహ్లోత్​

రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా.. శాసనసభ సమావేశాలు నిర్వహించాలన్న సీఎం గహ్లోత్​ ప్రతిపాదనను మరోమారు తోసిపుచ్చారు గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రా. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు సంధించారు గవర్నర్​.

R'than guv returns to Gehlot govt revised proposal on convening assembly session
రాజస్థాన్​: అసెంబ్లీ నిర్వహణపై గహ్లోత్​కు మళ్లీ చిక్కు
author img

By

Published : Jul 27, 2020, 12:36 PM IST

రాజస్థాన్​లో శాసనసభ సమావేశాలకు పిలుపునివ్వాలన్న ముఖ్యమంత్రి అశోక్​ గహ్లోత్​ కేబినెట్​ ప్రతిపాదనను మరోమారు తోసిపుచ్చారు గవర్నర్​ కల్​రాజ్​ మిశ్రా. మరిన్ని ప్రశ్నలు సంధిస్తూ ఆ ప్రతిపాదనను వెనక్కి పంపించారు.

గహ్లోత్​ ప్రతిపాదనను గవర్నర్​ వెనక్కిపంపడం ఇది రెండోసారి. అంతకుముందు.. బలనిరూపణ కోసం శాసనసభను నిర్వహించాలన్న గహ్లోత్​ అభ్యర్థనపై స్పష్టత కోరుతూ ఆరు ప్రశ్నలు అడిగారు మిశ్రా. వాటిపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్​.. పలు సవరణలతో మరో ప్రతిపాదనను పంపించింది. తాజాగా దాన్ని కూడా వెనక్కి పంపించేసారు మిశ్రా.

ఇదీ చూడండి:- రాజస్థాన్‌: బలనిరూపణకు కాదు, కరోనాపై చర్చకే!

వ్యాజ్యం ఉపసంహరణ..

మరోవైపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై రాజస్థాన్​ హైకోర్టు ఈ నెల 21న ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని స్పీకర్​ ఎన్​పీ జోషి ఉపసంహరించుకున్నారు. ఇందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ నెల 24న హైకోర్టు మరోమారు ఆదేశాలిచ్చిందని.. దానిపై చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్టు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది కపిల్​ సిబల్​ పేర్కొన్నారు. అనర్హత వేటు వేయకూడదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించకపోవడం వల్ల స్పీకర్​ వ్యాజ్యం నిరుపయోగంగా మారిందన్నారు.

ఇదీ జరిగింది..

సచిన్​పైలట్​ రెబల్​గా మారడం వల్ల రాజస్థాన్​ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. అనంతరం పైలట్​ను డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్​ పదవులను నుంచి తప్పించింది కాంగ్రెస్​. ఈ పరిణామాలతో ప్రభుత్వం సంక్షోభంలో పడింది. అయితే తమ వద్ద మెజారిటీ ఉందని.. తమ బలాన్ని నిరూపించుకునేందుకు శాసనసభ నిర్వహించాలని అశోక్​ గహ్లోత్​ ప్రభుత్వం గవర్నర్​ను కోరుతోంది.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.