రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ 24 గంటల పాటు ఉపవాసం ఉండనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 20న వ్యవసాయ సంస్కరణల బిల్లులపై చర్చ సందర్భంగా కొంత మంది విపక్ష ఎంపీలు తనతో వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడికి ఆయన లేఖ రాశారు.
"గత రెండు రోజులుగా నేను చాలా బాధగా, దుఃఖంగా ఉన్నాను. ఎంతో మనోవేదనను అనుభవిస్తున్నాను. సెప్టెంబర్ 20న రాజ్యసభలో జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా బాధించాయి. ప్రజాస్వామ్యం పేరిట కొంతమంది సభ్యులు ఎంతో అనుచితంగా ప్రవర్తించారు. పెద్దల సభ నియమ నిబంధనలను వారు అతిక్రమించారు. రూల్ బుక్‌ను చింపి నా మీదకు విసిరారు. నా ఎదురుగా ఉన్న బల్లపై కొంతమంది నిల్చొని అసభ్య పదజాలంతో నన్ను దూషించారు. ఆ ఘటన పదేపదే నాకు గుర్తుకు వస్తుంది. కనీసం నిద్రపోలేకపోతున్నాను. వారి ప్రవర్తనకు నిరసనగా ఒక్కరోజు పాటు ఉపవాసం ఉంటున్నాను."
- హరివంశ్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్
ఇదీ చూడండి: రాజ్యసభ సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు
రాష్ట్రపతికి లేఖ..
సదరు ఎంపీలు తనతో వ్యవహరించిన తీరుపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు హరివంశ్ లేఖ రాశారు. వారు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికం అన్నారు.