ETV Bharat / bharat

వెన్నెముకకు శస్త్ర చికిత్స చేసేందుకు రోబోలు - spine

ఇప్పటి వరకు శస్త్ర చికిత్సలు మానవులే చేశారు. మనిషితో పాటు మరమనుషులు శస్త్ర చికిత్స చేయటానికి సిద్ధమవుతున్నాయి. వెన్నెముకకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయాటానికి ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ పరిశోధన సంస్థ  రోబోటిక్​ వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ఇండియాలోనే మెట్టమెుదటిది.

వెన్నెముకకు శస్త్ర చికిత్స చేసేందుకు రోబోలు
author img

By

Published : Sep 6, 2019, 8:50 PM IST

Updated : Sep 29, 2019, 4:42 PM IST

ఇండియన్​ ఇన్ట్నిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ పరిశోధన సంస్థ 'స్పైన్​ సర్జరీ రోబో' ​​ను (వెన్నెముకకు శస్త్ర చికిత్స చేసే మర మనిషి) అభివృద్ధి చేసింది. ఈ రోబో​ ద్వారా రోగికి బాధ కలగకుండా, సులభంగా శస్త్ర చికిత్స చేసేందుకు దీనిని తయారుచేశారు ఐఐటీ మద్రాసుకు చెందిన పరిశోధకులు. ఇది ఇండియాలోనే మెుట్టమెుదటి వెన్నెముక రోబోటిక్​ వ్యవస్థ.

వెన్నెముకకు శస్త్ర చికిత్స చేయాటానికి సర్జన్లకు ఈ రోబోటిక్​ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. కానీ దీనికి సంబంధించిన పరికరాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. ప్రపంచంలో ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న చోట శస్త్ర చికిత్స చేయటానికి 1 మిలియన్​ డాలర్లు ఖర్చు అవుతుంది. వెన్నెముక చికిత్సకు అవసరమైన చోట రంధ్రం చేయటానికి వీలు పడటం లేదు. వెన్నెముకకు రంధ్రం చేసే విధంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. విజువలైజేషన్​కు, రియల్​ టైం ట్రాకింగ్​కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధన బృందం చెబుతోంది.

'సాధారణ శస్త్ర చికిత్స కంటే శస్త్ర చికిత్స సమయం, చికిత్స జరిగిన తర్వాత వచ్చే అంటువ్యాధులు తగ్గించేందుకు ఈ రోబోటిక్​ వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలను సాధించవచ్చు. దీని ద్వారా రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది.'

-మోహాన శంకర్​ శివ ప్రకాశం ఐఐటీ ప్రొఫెసర్​.

ఈ వ్యవస్థ చికిత్స సమయంలో రోగికి రేడియేషన్​ తగ్గిస్తూ రక్షణ కల్పిస్తుంది. చికిత్స చేసేటప్పుడు పర్యవేకిస్తూ, తగిన సమయంలో సూచనలు ఇవ్వటానకి రోబోకు అవసరమైన ట్రాకర్​ అమర్చారు. 3డీ వ్యవస్థ అమరికను ఏర్పాటు చేశారు. శస్త్ర చికిత్స చేయటానికి అవసరమైన అన్ని పరికరాలను అమర్చటానికి గ్రిపర్​ను ఉంచారు.

ఉచ్ఛతార్​ ఆవిష్కార్​ యోజన క్రింద అభివృద్ధి చేసిన ఈ రోబోటిక్ వ్యవస్థను ఇటివలే దిల్లీలో ప్రదర్శించారు.

ఇదీ చూడండి:చంద్రయాన్​-2 బడ్జెట్​ ఈ సినిమాల కన్నా తక్కువే!

Intro:Body:Conclusion:
Last Updated : Sep 29, 2019, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.