ETV Bharat / bharat

చైనాకు చెక్​: లద్దాఖ్​కు కొత్త రోడ్డు మార్గం

author img

By

Published : Aug 26, 2020, 9:30 AM IST

చైనాతో సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో వ్యూహాత్మక ప్రాజెక్ట్​లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది భారత్​. అందుకోసం హిమాచల్​ ప్రదేశ్​ నుంచి లద్దాఖ్​ వరకు గల రోడ్డు నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసింది. లద్దాఖ్​ను దెప్సాంగ్​ మైదానాలతో అనుసంధానించే ఒక కీలక రోడ్డు నిర్మాణ పనులూ జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్​ పనులను వేగవంతం చేయడం చైనాకు కంటగింపుగా మారింది.

ROAD CONSTRUCTION FROM HIMACHAL PRADESH TO LADDHAK
హిమాచల్​ నుంచి లద్దాఖ్​కు కొత్త రోడ్డు మార్గం

తూర్పూ లద్దాఖ్​లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో వ్యూహాత్మక రోడ్ల నిర్మాణంపై భారత్​ దృష్టి సారించింది. తాజాగా హిమాచల్​ ప్రదేశ్​లోని దార్చాను లద్దాఖ్​తో అనుసంధానించే కీలక పనులను వేగవంతం చేసింది. కొండ ప్రాంతంలో హిమమయంగా ఉండే అనేక మార్గాల గుండా ఈ రహదారి వెళుతుంది.

290 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గం.. లద్దాఖ్​ ప్రాంతంలోని సరిహద్దు సైనిక స్థావరాలకు బలగాలను, భారీ ఆయుధాలను తరలించేందుకు ఉపయోగపడుతుందని ఉన్నతాధికారులు తెలిపారు. కార్గిల్​ ప్రాంతానికీ కీలక సంధానతను కల్పిస్తుందని చెప్పారు. మనాలీ-లేహ్​, శ్రీనగర్​-లేహ్​ జాతీయ రహదారి తర్వాత లద్దాఖ్​కు దారితీసే మూడో మార్గంగా ఇది నిలుస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు 2022 చివరినాటికి పూర్తవుతుందని పేర్కొన్నారు. తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి దౌలత్​ బేగ్​ ఓల్డీ, దెప్సాంగ్​ వంటి కీలక ప్రాంతాల్లోనూ బలగాల తరలింపునకు వీలుగా అనేక రోడ్డు ప్రాజెక్టులను శరవేగంగా చేపడుతున్నట్లు వివరించారు. లద్దాఖ్​ను దెప్సాంగ్​ మైదానాలతో అనుసంధానించే ఒక కీలక రోడ్డును సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) నిర్మిస్తోందని తెలిపారు.

చైనాకు కంటగింపుగా..

ఈ ప్రాజెక్టుల పురోగతిని గత నెలలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సమీక్షించారు. దార్చాను లద్దాఖ్​తో సంధానించే రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఈ భేటీలో ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. తూర్పు లద్దాఖ్​లోని పాంగాంగ్​ సరస్సు వెంబడి ఫింగర్స్​ ప్రాంతంలో భారత్​ కీలక రోడ్డును వేయడం, దార్బుక్​-ష్యోక్​-దౌలత్​ బేగ్​ ఓల్డీని సంధానిస్తూ మరో రహదారిని నిర్మించడం చైనాకు కంటగింపుగా మారింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో ఉద్రిక్తలకు ఆ దేశం తెరతీసింది.

భుజంపై నుంచి ప్రయోగించే క్షిపణులతో సిద్ధం

మరోవైపు తూర్పు లద్దాఖ్​లో భారత్​ తన పోరాట సన్నద్ధతను మరింత పెంచుకుంది. భుజంపై నుంచి ప్రయోగించే వీలున్న క్షిపణులతో కూడిన బలగాలను సున్నితమైన ప్రాంతాల్లో మోహరించింది. అక్కడ సైనిక హెలకాఫ్టర్ల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఈ చర్యను చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒకవేళ లోహ విహంగాలు భారత గగనతలంలోకి చొరబడితే ఈ క్షిపణులతో నేలకూల్చవచ్చు.

శత్రువుల యుద్ధ విమానాలను పేల్చివేసేందుకు రష్యా నుంచి కొనుగోలు చేసిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం, వైమానిక దళం ఇప్పటికే మోహరించాయి. రాడార్లను ఏర్పాటు చేయడం ద్వారా నిఘాను కూడా పెంచాయి. మరోవైపు చైనా కూడా ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో వైమానిక స్థావరాల్లో మౌలిక వసతులను పెంచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.