అహ్మదాబాద్-ముంబయి హై స్పీడ్ రైల్ కారిడార్‌కు అవసరమైన పర్యావరణ (వన్యప్రాణి, అటవీ, కోస్టల్ రెగ్యులేషన్ జోన్) అనుమతులను పొందినట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై ఏర్పాటు చేసిన వర్చువల్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే. యాదవ్.
ప్రాజెక్ట్‌కు కావాల్సిన భూమిలో ఇప్పటివరకు 67శాతాన్ని సేకరించినట్టు యాదవ్ తెలిపారు. గుజరాత్‌లోని 956 హెక్టార్లలో 825 హెక్టార్లు సమకూర్చినట్టు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని 432 హెక్టార్లలో 97 హెక్టార్లు పొందినట్టు స్పష్టం చేశారు. దాద్రా నగర్ హవేలీలో 7 హెక్టార్ల భూమి తమ ఆధీనంలో ఉందని వివరించారు యాదవ్.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నాటి జపాన్ ప్రధాని షింజో అబే.. 2017 సెప్టెంబర్‌లో ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు. దీని మొత్తం వ్యయం రూ. 1.08 లక్షల కోట్లు. 2023 నాటికి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉంది.
2022 నాటికి డీఎఫ్సీ పూర్తి!
2022 నాటికి డీఎఫ్సీ(డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్) పనులు పూర్తవుతాయని వెల్లడించారు రైల్వే బోర్డు ఛైర్మన్. దీని వ్యయం రూ. 81,459 కోట్లు అని స్పష్టం చేశారు.
ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద రైల్వే మౌలికవసతుల ప్రాజెక్ట్ ఈ డీఎఫ్సీ. దీని మొత్తం పొడవు 3,360 కిలోమీటర్లు.
ఇదీ చూడండి:- 'బుల్లెట్ ట్రైన్ కాంట్రాక్టులు 72 శాతం దేశీయ సంస్థలకే'