ETV Bharat / bharat

"రిజర్వేషన్​ ఖాయం!"

అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్​ బిల్లు ఆమోదానికి కృషి చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​గాంధీ ఒడిశాలో హామీ ఇచ్చారు.

"రిజర్వేషన్​ ఖాయం!"
author img

By

Published : Mar 8, 2019, 4:37 PM IST

కేంద్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే... మహిళలపై వేధింపులకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. నేరస్థులకు త్వరితగతిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఒడిశా కోరాపుట్​ జిల్లా జయపురలో మహిళలతో చర్చాగోష్టిలో పాల్గొన్నారు రాహుల్. మహిళా రిజర్వేషన్​ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్​ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.

పంచాయతీల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చాం. దీనివల్ల మహిళలు ప్రయోజనం పొందారు. ఇప్పుడు వారి గళం పంచాయతీల వరకు చేరింది. లోక్​సభ, విధానసభలో వారికి స్థానం కల్పించాల్సి ఉంది. దీన్ని రిజర్వేషన్ల ద్వారా సాధించవచ్చు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్​ బిల్లును లోక్​సభ, రాజ్యసభలో ఆమోదం పొందేందుకు చర్యలు తీసుకుంటాం
-రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఒడిశాలో కాంగ్రెస్​కు అధికారమిస్తే మహిళలందరికీ ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు రాహుల్. గిరిజన, దళిత, వెనుకబడిన తరగతుల మహిళల సాధికారతకు ఈ చర్య అవసరమని అభిప్రాయపడ్డారు.

Bhopal (Madhya Pradesh) Mar 08 (ANI): To celebrate International Women's day, Indian Railways pay special tribute to girl power. Bhopal-Bilaspur Express train in Madhya Pradesh left from Bhopal Railway Station with all women railway staff, including the ticket checker, Loco Pilot and GRP Constable. "Today I am very happy that on the occasion of international women's day the railway government gave me permission to run special train. I will run this train from Bhopal to Bina," Loco Pilot said.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.