ETV Bharat / bharat

లక్షలు నిండిన బ్యాగు దొరికితే.. తిరిగిచ్చేసిన ఆటోడ్రైవర్! - Vitthal Mapare

మహారాష్ట్రలో ఓ ఆటో డ్రైవర్ నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. తన ఆటోలో బంగారం, నగదు కలిపి రూ. 7 లక్షలు విలువ చేసే ఓ సంచి దొరికితే, ఇంటికి పట్టుకెళ్లకుండా పోలీసులకు అప్పజెప్పాడు.

Rickshaw driver returns bag containing 7 lakh to Pune couple
లక్షలు నిండిన బ్యాగు దొరికితే.. తిరిగెచ్చేసిన ఆటోడ్రైవర్!
author img

By

Published : Sep 12, 2020, 8:41 AM IST

ప్రస్తుత కాలంలో రోడ్డు మీద వంద రూపాయలు దొరికితే పక్కవారిని ఈ డబ్బు మీదేనా అని కూడా అడగకుండా, జేబులో వేసుకెళ్లిపోయేవారికి కొదవే లేదు. కానీ, మహారాష్ట్రలో ఓ సాధారణ ఆటోడ్రైవర్ తనకు దొరికిన రూ. 7 లక్షలు విలువ చేసే బంగారం, నగదు ఉన్న బ్యాగును పట్టుకెళ్లి పోలీసులకు అప్పజెప్పేశాడు. నిజాయతీకి నిదర్శనంగా నిలిచాడు.

పుణెకు చెందిన విఠల్ మపారె(60) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుమారుడు ఓ ప్రైవేటు సంస్థలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అద్దె ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు. పేదరికంలో బతుకీడుస్తున్నా.. మంచితనం అనే గొప్ప ఆస్తి విఠల్ సొంతం. బుధవారం కేశవ్ నగర్​లో ఓ జంట విఠల్ ఆటో ఎక్కారు. హడప్సర్ బస్టాండులో దిగిపోయారు. కానీ, తమతో తెచ్చుకున్న సంచిని ఆటోలోనే మరిచిపోయారు.

ఆ బ్యాగును గమనించిన విఠల్.. అందులో ఏముందని కూడా చూడకుండా సరాసరి పోలీస్ స్టేషన్​కు పట్టుకెళ్లాడు.

"ఆ దంపతులను బస్టాండులో దింపేసి.. బీటీ కవాడే రోడ్డులో ఆటో పక్కన నిలిపి, చాయ్ తాగుతున్నప్పుడు వెనక సీటులో ఓ బ్యాగు కనిపించింది. దాన్ని నేను తెరచి చూడలేదు కానీ, ఈ బ్యాగు ఆటో దిగిపోయిన ఆ దంపతులదే అనుకున్నాను. వెంటనే సమీపంలోని ఘోర్పాడి చౌకీ పోలీస్ స్టేషన్​కు పట్టుకెళ్లి అప్పజెప్పేశాను."

- విఠల్ మపారె

విఠల్ నిజాయతీ వల్ల బ్యాగు తిరిగి ఆ జంటకు చేరింది. దీంతో, ఆటో డ్రైవర్ అయినా గొప్ప హృదయంతో ఆదర్శంగా నిలిచాడని సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.

"నిబంధనల మేరకే బ్యాగు తెరచి చూశాం. అందులో సుమారు రూ. 7 లక్షల విలువైన నగదు, బంగారం కనిపించాయి. రూ. 20 వేలు నగదు, 11 తులాల బంగారంతో పాటు దుస్తులు కనిపించాయి. దీంతో, ఆ దంపతులు దిగిన హడప్సర్ పరిధి పోలీసులకు సమాచారమిచ్చాం. మెహబూబ్, షనాజ్ దంపతులు తమ బ్యాగు పోయిందని ఫిర్యాదు చేశారని వారు తెలిపారు. ఆపై ఆ బ్యాగును వారికి ఇచ్చేశాం. విషయం తెలుసుకున్న డీజీపీ సుహాస్ బాచే విఠల్​ను సత్కరించారు. "

-విజయ్ కదం, ఎస్ఐ

ఇదీ చదవండి: పంచతంత్రంతో శాంతి మంత్రం! ఐదు సూత్రాలివే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.