ETV Bharat / bharat

'పితృ పక్షాల తర్వాతే అయోధ్యలో రామాలయ నిర్మాణం' - అయోధ్య

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్​ స్పష్టతనిచ్చింది. ఈ నెల 17తో పితృ పక్షాలు పూర్తవుతాయని.. ఆ తర్వాతే ఆలయ నిర్మాణం మొదలవుతుందని పేర్కొంది. పునాది వేసేందుకు ఎల్​ అండ్​ టీ సంస్థ సిద్ధంగా ఉందని వెల్లడించింది.

Ram temple construction to begin after 'pitra paksha'
'పితృ పక్షాల తర్వాతే అయోధ్యలో రామమందిర నిర్మాణం'
author img

By

Published : Sep 6, 2020, 4:49 PM IST

అయోధ్య రామాలయ నిర్మాణానికి భూమిపూజ జరిగి నెల రోజులు పూర్తయింది. అయినప్పటికీ నిర్మాణ కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదు. తాజాగా.. ఈ విషయంపై కొంత స్పష్టత వచ్చింది. ఈ నెల 17తో పితృ పక్షాలు పూర్తవుతాయని.. ఆ తర్వాత రామమందిర నిర్మాణ పనులు మొదలవుతాయని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ వెల్లడించింది.

హిందువులు తమ పూర్వీకులకు కృతజ్ఞతలు తెలుపుకుని, వారిని గుర్తుతెచ్చుకునే కాలాన్నే పితృ పక్షాలు అని అంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలను జరుపుకోరు.

ఇదీ చూడండి:- మోదీ కార్యక్రమాల్లో 'అయోధ్య భూమిపూజ' టాప్​

ఎల్​ ఆండ్​ టీ సిద్ధం...

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్​ అండ్​ టీ.. ఆలయానికి పునాదిని వేసేందుకు సిద్ధంగా ఉందని ట్రస్ట్​ ప్రధాన కార్యదర్శి చంపత్​ రాయ్​ వెల్లడించారు. ఆలయ పునాది కోసం భూమికి 100 అడుగుల లోతులో దాదాపు 1,200 స్తంభాలను వేయనుంది. ఈ స్తంభాలు పూర్తిగా రాళ్లతోనే నిర్మిస్తారు. ఆ తర్వాత.. వీటిపై మరోమారు పునాదులు వేస్తారు. ఇందుకోసం ఇప్పటికే ముంబయి నుంచి యంత్రాలను తీసుకువచ్చింది ఎల్​ అండ్​ టీ.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.