జమ్ముకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్‌లోని సరిహద్దు ప్రాంతాలలో నిర్మించిన 43 వంతెనలను.. గురువారం జాతికి అంకితమివ్వనున్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్. భద్రతా దళాలు, ఆయుధాల తరలింపునకు ఈ వంతెనలు సహాయపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
"ఆన్లైన్ కార్యక్రమంలో భాగంగా.. 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్ఓ) నిర్మించిన వంతెనలను రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రారంభిస్తారు."
--- రక్షణశాఖ వర్గాలు.
లద్దాఖ్‌లో 7...
అయితే ఈ 43లో 7 వంతెనలు లద్దాఖ్‌లో నిర్మించినవే కావడం విశేషం. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల తరుణంలో ఈ బ్రిడ్జీలు అందుబాటులోకి రావడం భారత్‌కు కలిసివచ్చే విషయం.
మిగిలిన వాటిల్లో.. 10 వంతెనలు జమ్ముకశ్మీర్, రెండు హిమాచల్‌ప్రదేశ్, 8 ఉత్తరాఖండ్, 8 అరుణాచల్‌ప్రదేశ్, నాలుగు సిక్కిం, నాలుగు పంజాబ్‌లో ఉన్నాయి. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ తావాంగ్లోని నిచిఫు టన్నెల్‌కు రాజ్‌నాథ్ శంకుస్థాపన చేస్తారని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి:- సరిహద్దులో భారత్ వ్యూహాలు.. అన్నివైపులా బిగింపులు!