ETV Bharat / bharat

సరిహద్దుల్లో కీలక వంతెనలను ప్రారంభించిన రాజ్​నాథ్​ - Rajanth latest news

జమ్ముకశ్మీర్​​లో సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్​ఓ) నిర్మించిన కీలక వంతెనలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఆన్​లైన్​ ద్వారా ప్రారంభించారు. ఎంతో సమర్థంగా వంతెన నిర్మాణాలను పూర్తి చేసిన బీఆర్​ఓను అభినందించారు రాజ్​నాథ్​.

Rajnath Singh inaugurates 6 bridges built by BRO
సరిహద్దుల్లో కీలక వంతెనలను ప్రారంభించిన రాజ్​నాథ్​
author img

By

Published : Jul 9, 2020, 1:50 PM IST

తూర్పు లద్దాఖ్​ ఘటనతో దేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణాలపై దృష్టి కేంద్రికరించింది భారత్. ఈ నేపథ్యంలోనే సరిహద్దు రోడ్డు సంస్థ(బీఆర్​ఓ)​ రూ.43 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆరు వంతెనలు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​.

"ప్రపంచం దేశాలు ఒకదానికొకటి భిన్నంగా, దూరంగా ఉండాలని భావిస్తున్నాయి. ఇటువంటి సమయంలో వంతెనలను ప్రారంభిస్తున్నందుకు సంతోషిస్తున్నాను. వీటి నిర్మాణాన్ని సమర్థంగా పూర్తి చేసిన సరిహద్దు రోడ్డు సంస్థకు అభినందనలు. బీఆర్ఓ ఏర్పడినప్పటి నుంచి సరిహద్దుల్లోని సుదూర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంలో ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. ఇప్పటికే అనేక నిర్మాణాలు ఎంతో నైపుణ్యంతో పూర్తి చేసింది."

-రాజ్​నాథ్​ సింగ్​, కేంద్ర రక్షణ శాఖ మంత్రి

చైనాతో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో.. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి నిర్మాణాలను కొనసాగించాలని బీఆర్​ఓను ఆదేశించింది కేంద్రం.

ఇదీ చూడండి: ఉత్తర్​ప్రదేశ్​ గ్యాంగ్​స్టర్​ వికాస్​ దూబే అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.