ETV Bharat / bharat

లద్దాఖ్​ ప్రతిష్టంభనపై లోక్​సభలో నేడు రాజ్​నాథ్​ ప్రకటన

లద్దాఖ్​లో వాస్తవాధీన రేఖ(ఎల్​ఏసీ) సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్​ నేడు పార్లమెంట్​లో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులతో పాటు, ఈ విషయంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో రాజ్​నాథ్ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Rajnath likely to make statement in Parliament on Sino-India issue
లద్దాఖ్​ ప్రతిష్టంభనపై లోక్​సభలో నేడు రాజ్​నాథ్​ ప్రకటన
author img

By

Published : Sep 15, 2020, 5:42 AM IST

తూర్పు లద్దాఖ్​లో భారత్, చైనా సైన్యం మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన అంశంపై రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఇవాళ పార్లమెంట్​లో ఓ ప్రకటన చేయనున్నారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితిపై లోక్​సభకు పలు విషయాలు వివరించే అవకాశం ఉంది.

రష్యా పర్యటనలో రాజ్​నాథ్ సింగ్​ ఇదివరకే చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంగేతో సమావేశమయ్యారు. మరోవైపు మంత్రి జైశంకర్ సైతం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ అయ్యారు. అటు.. ఈ విషయంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో రాజ్​నాథ్ ప్రకటనపై ఆసక్తి నెలకొంది.

మరోవైపు కేంద్ర కేబినెట్​, ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ సమిటీలు ఇవాళ(మంగళవారం) మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.