మూడు రోజులుగా దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్. రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారం పెంపొందించే దిశగా నేడు ఆ దేశ రక్షణమంత్రి జియాంగ్ కియాంగ్డూతో భేటీ అయ్యారు. రక్షణ ఉత్పత్తుల సంయుక్త తయారీ, ఇరుదేశాల నావికాదళాల మధ్య పరస్పర సహకారం దిశగా చర్చలు జరిపారు.
రక్షణ విభాగంలో ద్వైపాక్షిక సహకారం కోసం ఇద్దరు మంత్రులు విస్తృతంగా చర్చలు జరిపారని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఇరు దేశాల మధ్య రక్షణ విద్య, నావికాదళాల మధ్య సమాచార మార్పిడికి సంబంధించి ఒప్పందాలు కుదిరాయి.
ఇదీ చూడండి: చంద్రయాన్-2: ఆ 15 నిమిషాలు ఉత్కంఠభరితం