కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తన కోసం సీబీఐ గాలిస్తున్న తరుణంలో అలీపుర కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ వినతిని తిరస్కరించింది న్యాయస్థానం. శుక్రవారం కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు రాజీవ్‌కుమార్. శారదా కేసులో రాజీవ్‌ను అరెస్టు చేసేందుకు వారెంట్ అవసరం లేదన్న కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐ ఛార్జిషీటులో తన పేరు లేదని పేర్కొంటూ రాజీవ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విచారించారు జడ్జి. బెయిల్ వినతిని తోసిపుచ్చారు.
2013లో శారదా కుంభకోణాన్ని విచారించిన బృందానికి రాజీవ్ సారధ్యం వహించారని పేర్కొన్నారు బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన సీబీఐ అధికారి కేసీ మిశ్రా.
"మేం బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించేందుకు బలమైన కారణాలున్నాయి. సుప్రీంకోర్టు అభిప్రాయానికి అనుగుణంగా కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్నాం."
-కోర్టులో సీబీఐ వాదన
సీబీఐ ద్వారా వచ్చిన సమన్లను తిరస్కరించడం ద్వారా చట్టన్ని అగౌరవపరుస్తున్నారని వ్యాఖ్యానించారు మిశ్రా.
ఇదీ చూడండి: ఇంట్లో బాణాసంచా పేలుడు- ఆరుగురు మృతి