ETV Bharat / bharat

కాంగ్రెస్​పై మాయ ఫైర్.. ఎమ్మెల్యేల విలీనంపై కోర్టుకు!

రాజస్థాన్ రాజకీయం రసకందాయంలో పడింది. తమ సభ్యులను అనైతికంగా విలీనం చేసుకున్నారని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించింది బీఎస్పీ అధినేత్రి మాయవతి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

rajasthan
కాంగ్రెస్​పై మాయ ఫైర్.. ఎమ్మెల్యేల విలీనంపై కోర్టుకు!
author img

By

Published : Jul 28, 2020, 11:36 AM IST

Updated : Jul 28, 2020, 12:33 PM IST

రాజస్థాన్ రాజకీయాల్లో కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల అనంతరం తమ శాసనసభ్యులను మభ్యపెట్టి చట్టవిరుద్ధంగా కాంగ్రెస్​లో విలీనం చేసుకున్నారని ఆరోపించింది బీఎస్పీ అధినేత్రి మాయవతి. దీనిని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించింది బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయవతి.

"ఎన్నికల అనంతరం బీఎస్పీ బేషరతుగా కాంగ్రెస్​కు మద్దతు పలికింది. అయితే దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ రాజ్యాంగ విరుద్ధంగా మా శాసనసభ్యులను కాంగ్రెస్​లో విలీనం చేసుకున్నారు. ఇంతకుముందు ఆయన పదవీకాలంలో కూడా ఇలాగే చేశారు. బీఎస్పీ ఇంతకంటే ముందే కోర్టుకు వెళ్లేది. అయితే సరైన సమయం కోసం వేచిచూశాం. ప్రస్తుతం మా సభ్యుల విలీనాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నాం. దీనిపై సుప్రీం కోర్టు వరకు పోరాడతాం."

-మాయవతి, బీఎస్పీ అధినేత్రి

రాజస్థాన్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష జరిగితే కాంగ్రెస్​కు వ్యతిరేకంగా ఓటు వేయమని తమ శాసనసభ్యులను కోరినట్లు వెల్లడించారు మాయవతి.

'రాష్ట్ర స్థాయిలో కుదరదు..'

తమది జాతీయ పార్టీ అయినందున రాష్ట్రస్థాయిలో విలీనం కుదరదని బీఎస్పీ ముఖ్యనేతలు చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా, అందరికీ కలిపి నోటీసులు జారీ చేశామని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కోర్టుతీర్పుతో పార్టీల బలబలాలు మారితే కాంగ్రెస్ మనుగడ కష్టమేనని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: రక్షణ రంగ సంస్కరణలేవీ
?

Last Updated : Jul 28, 2020, 12:33 PM IST

For All Latest Updates

TAGGED:

stocks
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.