ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలో ఇకపై మాస్క్​ ధరించటం తప్పనిసరి! - మాస్క్​ ధరించటం తప్పనిసరి

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలకు ఉపక్రమించింది రాజస్థాన్​ ప్రభుత్వం. పబ్లిక్​ ప్రాంతాల్లో మాస్క్​ ధరించటాన్ని తప్పనిసరి చేస్తూ.. రాష్ట్ర అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది.

wearing face mask mandatory
మాస్క్​ ధరించటం తప్పనిసరి
author img

By

Published : Oct 31, 2020, 3:55 PM IST

Updated : Oct 31, 2020, 4:51 PM IST

రాష్ట్రంలో విజృంభిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు మాస్క్​ ధరించటాన్ని తప్పనిసరి చేసింది రాజస్థాన్​ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

రాజస్థాన్​ అంటువ్యాధుల (సవరణ) బిల్​-2020ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధారివాల్​. ఈ బిల్లులోని సెక్షన్​-4లో కొత్త క్లాజ్​ను చేర్చారు. జనసంచార ప్రాంతాల్లో నోరు, ముక్కును మూసి ఉంచేలా మాస్క్​ లేదా కవర్​ లేకుండా తిరగటాన్ని నేరంగా భావించాలని ఈ క్లాజ్​​ సూచిస్తోంది.

పబ్లిక్​ ప్రాంతాలతో పాటు పని ప్రదేశాలు, సామాజిక, రాజకీయ సమావేశాలు, పబ్లిక్​, ప్రైవేటు ప్రయాణాల్లోనూ మాస్క్​ ధరించటం తప్పని సరి చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: మాస్కు వేసుకోకుంటే రోడ్లు శుభ్రం చేయాల్సిందే!

Last Updated : Oct 31, 2020, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.