పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ ప్రభుత్వం. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులైన సమానత్వం, జీవించే హక్కులను ఉల్లంఘించే విధంగా సీఏఏ ఉందని పిటిషన్లో పేర్కొంది.
భారత రాజ్యాంగంలో పొందుపరిచిన నియమాలకు వ్యతిరేకంగా ఈ చట్టం ఉందని పిటిషన్లో తెలిపింది అశోక్ గహ్లోత్ సర్కారు. సీఏఏ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో విభేదించి సుప్రీం కోర్టును ఆశ్రయించిన రెండో రాష్ట్రం రాజస్థాన్. అంతకుముందు కేరళ ప్రభుత్వం సీఏఏను వ్యతిరేకిస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.
పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో మైనార్టీలైన హిందు, సిక్కు, బౌద్ధ, జైన్లు, పార్శీ, క్రైస్తవులను దేశంలోకి ఆహ్వానించేందుకు వీలుగా పౌరసత్వ చట్టాన్ని సవరించారు. సవరణకు వ్యతిరేకంగా దేశంలో ఇప్పటికే పలు చోట్ల అల్లర్లు జరిగాయి.
ఇదీ చూడండి: పాత బాటిళ్లపై కొత్త లేబుళ్లు.. రూ.50 లక్షల శానిటైజర్లు సీజ్