మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. భవన శిథిలాల కింది నుంచి చాలా మందిని కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వీరిలో ఓ నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డర్ ఫారూక్ కాజీ, ఆర్కిటెక్ట్ గౌరవ్ షాపై 304, 304ఏ, 338 కింద అభియోగాలు మోపారు.
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సూచనల మేరకు మంత్రి ఏకనాథ్ శిందే మహద్‌కు చేరుకున్నారు. ఉదయం నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు శిందే.
ఇదీ చూడండి: మహారాష్ట్రలో కుప్పకూలిన ఐదంస్తుల భవనం