కర్ణాటక రాయ్‌చూర్‌లో ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని హత్యకు గురైంది. ఏప్రిల్ 13న అదృశ్యమైన ఆమె మూడు రోజుల తర్వాత శవమై చెట్టుకు వేలాడుతూ కనిపించింది. మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉంది. విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని తోటి విద్యార్థులు గురువారం పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు.
పరీక్షల్లో తప్పినందు వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని మొదట పోలీసులు చెప్పారు. తర్వాత... తమ కూతురిని అత్యాచారం చేశారన్న విద్యార్థిని తల్లి వాంగ్మూలాన్ని పరిగణనలోకి తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు సుదర్శన్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసుకు సంబంధించి కొన్ని ఆధారాలను సేకరించారు. పోస్టుమార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉంది.
ఇదీ చూడండి: రోహిత్ శేఖర్ తివారీది అసహజ మరణం...