ETV Bharat / bharat

'ఆరోగ్య సేతు యాప్​తో ప్రజల సమాచారం భద్రమేనా?' - రాహుల్ గాంధీ ట్విట్టర్

కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్​పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. యాప్​ నిర్వహణ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం వల్ల.. ప్రజల సమాచార భద్రత, గోప్యతపై ఆందోళనలు నెలకొన్నాయని తెలిపారు. పీఎం కేర్స్​ నిధిపై ఆడిట్​ చేయించాలని కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ కోరారు.

RAHUL-AROGYA APP
ఆరోగ్య సేతు
author img

By

Published : May 2, 2020, 9:09 PM IST

ఆరోగ్య సేతు యాప్​పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అధునాతన నిఘా వ్యవస్థను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టడాన్ని తప్పుబట్టారు. ప్రజల సమాచార భద్రత, గోప్యతపై తీవ్ర ఆందోళన నెలకొందని ఆరోపించారు.

"ఆరోగ్య సేతు యాప్​.. అధునాతన నిఘా వ్యవస్థ. దీనిని ఎలాంటి సంస్థాగత పర్యవేక్షణ లేకుండా ఓ ప్రైవేటు సంస్థ చేతిలో పెట్టారు. సమాచార భద్రత, గోప్యతపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనల్ని ప్రమాదం నుంచి సాంకేతికత రక్షిస్తుంది. కానీ అనుమతి లేకుండా వారి వివరాలను సేకరించటం భయాన్ని కలిగిస్తుంది."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం ఆరోగ్య సేతు యాప్​ను రూపొందించింది. ఈ యాప్ వినియోగదారులకు.. చుట్టుపక్కల కరోనా వైరస్​ వ్యాప్తి గురించి సమాచారం ఇస్తుంది. వారు క్షేమంగానే ఉన్నారా అనే విషయాలతో పాటు ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తుంది.

ఈ యాప్​ను ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా వాడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఉద్యోగులు కూడా వాడేలా చూడాలని ఆయా సంస్థలకు సూచించింది.

నిపుణులు అభ్యంతరం..

ఈ యాప్​పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. గోప్యతకు సంబంధించి పలువురు నిపుణులు వివిధ రకాల సమస్యలను లేవనెత్తుతున్నారని చెప్పారు.

పీఎం కేర్స్​పై ఆడిట్​..

కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్​ నిధిపై ఆడిట్ నిర్వహించాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కోరారు. ఈ సంక్షోభ సమయంలో పారదర్శకత అవసరమని ఆమె సూచించారు. నిధి కోసం ప్రతి ఒక్కరి నుంచి రూ.100 సేకరిస్తున్నారని.. ఈ విషయంలో మదింపు జరిగితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: కొత్త స్మార్ట్‌ఫోన్లలో 'ఆరోగ్య సేతు' తప్పనిసరి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.