కేంద్రంపై మరోమారు విమర్శల దాడికి దిగారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఆర్థికవ్యవస్థను సర్వనాశనం చేసిందని మండిపడ్డారు.
కేంద్రం అసమర్థత వల్ల కరోనా మరణాలు, జీడీపీ వృద్ధిలో ఆసియా దేశాల్లోనే భారత్ అట్టడుగున నిలిచిందని ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ. అంతర్జాతీయ ధ్రవ్యనిధి గణాంకాల ఆధారంగా 2020 ఏడాదికి గాను దేశాల జీడీపీ వృద్ధి, ప్రతి 10 లక్షల మందిలో సంభవించిన కరోనా మరణాల వివరాలను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.
-
How to completely destroy an economy and infect the maximum number of people really quickly. pic.twitter.com/5kbMpmnIpZ
— Rahul Gandhi (@RahulGandhi) October 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">How to completely destroy an economy and infect the maximum number of people really quickly. pic.twitter.com/5kbMpmnIpZ
— Rahul Gandhi (@RahulGandhi) October 19, 2020How to completely destroy an economy and infect the maximum number of people really quickly. pic.twitter.com/5kbMpmnIpZ
— Rahul Gandhi (@RahulGandhi) October 19, 2020
"ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడం, అత్యంత వేగంగా కరోనా కేసుల సంఖ్య పెంచడం ఎలానో చూడండి"
రాహుల్ గాంధీ ట్వీట్.
ఈ వివరాల ప్రకారం 2020 ఏడాదికి భారత జీడీపీ వృద్ధి మైనస్ 10.3గా ఉంది. దేశంలో ప్రతి 10 లక్షల మందికి 83మంది కరోనాతో మరణిస్తున్నారు. ఆసియా దేశాల్లో భారత్ అట్టడుగున నిలిచింది. బంగ్లాదేశ్, చైనా, పాకిస్థాన్ వంటి దేశాలు భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉన్నాయి.