ETV Bharat / bharat

'క్వాడ్​ కేవలం సైనిక మైత్రి కాదు.. అంతకుమించి'

author img

By

Published : Oct 8, 2019, 11:32 AM IST

క్వాడ్... భారత్​, అమెరికా, జపాన్​, ఆస్ట్రేలియా మధ్య రక్షణపరమైన సహకారం కోసం ఏర్పాటైన కూటమి. 4 దేశాల మధ్య ఎప్పుడు అధికారుల స్థాయికి మాత్రమే పరిమితమయ్యే చర్చలు... ఈసారి విదేశాంగ మంత్రుల స్థాయిలో జరిగాయి. ఎందుకిలా? ఈ మార్పు వెనుక... చైనాను కట్టడి చేయాలన్న వ్యూహం ఉందా? ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చారు నౌకాదళ విశ్రాంత అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ.

'క్వాడ్​ కేవలం సైనిక మైత్రి కాదు.. అంతకుమించి'

న్యూయార్క్‌లో ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా భారత్​, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల మధ్య చతుర్ముఖ భద్రతా వ్యవస్థ (క్వాడ్)పై చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చలు సైనిక మైత్రి కోసం మాత్రమే కాదని భారత నౌకాదళ విశ్రాంత అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ తెలిపారు.

DK SARMA
కెప్టెన్ డీకే శర్మ, భారత నౌకాదళ విశ్రాంత అధికార ప్రతినిధి

భారత్​, అమెరికా మధ్య నవంబర్​లో జరగబోయే మొదటి ఉమ్మడి త్రివిద దళాల సైనిక విన్యాసాలు ఇరు దేశాల మధ్య పెంపొందిన నమ్మకానికి చిహ్నమని ఆయన అభిప్రాయపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ స్మితా శర్మతో మాట్లాడుతూ.."90 వ దశకంలో భారత్​, జపాన్, అమెరికా మధ్య మలబార్ శిక్షణాభ్యాసం మొదలైంది. ఆస్ట్రేలియాను ఇందులో చేర్చకపోవడం ఆందోళన కలిగించే విషయం కాదు.

ఈ సైనిక అభ్యాసాలు చైనాకు చెక్​ పెట్టడానికి అని కూడా అనలేం. జపాన్ తీరంలో శుక్రవారం ముగిసిన కీలక త్రైపాక్షిక సముద్ర విన్యాసాల్లో.. భారత నావికాదళానికి చెందిన రెండు అత్యాధునిక యుద్ధనౌకలు ఐఎన్ఎస్ సహ్యాద్రి, యాంటీ సబ్​మెరైన్​ యుద్ధనౌక కొర్వెట్టి కిల్తాన్ పాల్గొన్నాయి.

బోయింగ్ 'పీ8 ఐ' దీర్ఘ శ్రేణి నౌకాదళ గస్తీ విమానం, జపనీస్ ఇజుమో హెలికాప్టర్ క్యారియర్ జేఎస్ కాగా, క్షిపణి విధ్వంసానికి సాయపడే జేఎస్ సమిదారే, చౌకై, 'పీ 1' దీర్ఘ శ్రేణి సముద్ర గస్తీ విమానం ఈ సంక్లిష్ట సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. యాంటీ-ఎయిర్, యాంటీ-సర్ఫేస్​ ఫైరింగ్స్, వ్యూహాత్మక మారిటైమ్ ఇంటర్‌డిక్షన్ ఆపరేషన్స్ నిర్వహించారు" అని తెలిపారు కెప్టెన్​ డీకే శర్మ. క్వాడ్ సహా వివిధ అంశాలపై ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

QUAD
చతుర్ముఖ భద్రతా వ్యవస్థ (క్వాడ్​)లో భాగస్వామ్య దేశాలు

ప్ర. క్వాడ్​ సమావేశాలను విదేశాంగ మంత్రుల స్థాయికి తీసుకురావడం ఎంత వరకు ఉపయోగకరం?

జ. చతుర్ముఖ భద్రతా చర్చలు ఇప్పటివరకు సైన్యం గురించి తప్ప మరొకటి కాదు. మలబార్ సైనిక శిక్షణలో జపాన్‌ను జోడించినందున నేను చాలా నమ్మకంతో ఈ విషయం చెబుతున్నాను. ఇప్పుడు ఇందులో భారత్​, జపాన్, అమెరికా శాశ్వత సభ్యులు. జపాన్​లో యూఎస్ సైనిక స్థావరం మలబార్ శిక్షణ కోసం ఉపయోగించడం వల్లే ఆ దేశాన్ని ఇందులో చేర్చారు.

ఆస్ట్రేలియాతో భారత్​ 2014, 2016, 2019 లో మూడు ప్రధాన ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకొంది. ఇది చాలా క్లిష్టమైన సైనిక అభ్యాసం. ఇక్కడ మనం ఉత్తమ నౌకలు, జలాంతర్గాములు, సుదూర సముద్ర గస్తీ విమానాలను, హెలికాప్టర్లను వాడుతున్నాము. అమెరికా ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాతో కలసి ఆర్​ఐఎమ్​పీఏసీ- ఆర్​ఐఎమ్​ పేరిట పసిఫిక్ సముద్ర శిక్షణాభ్యాసం నిర్వహిస్తున్నాం.

అలానే హెచ్​ఏడీఆర్​ (హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్) అనే 'కక్డు' శిక్షణాభ్యాసం ఉంది. భారత నావికాదళం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 'ఓప్​ మిలన్' నిర్వహిస్తోంది. ఆస్ట్రేలియా అందులో ఓ భాగస్వామి. క్వాడ్​ ఒక సైనిక శిక్షణ.

ప్ర. చైనా తమ 70వ వార్షికోత్సవ సైనిక పరేడ్​లో కొత్త ఆయుధాలను ప్రదర్శించడం ద్వారా ఏం సందేశం ఇవ్వదలచుకుంది?

జ. చైనా ఒక సూపర్ పవర్. మనం ఏమైనా కనిపెడితే... అలానే సగర్వంగా ప్రదర్శిస్తాము. 30 నిమిషాల్లో నిర్దిష్ట ప్రదేశానికి చేరుకోగలిగే వ్యవస్థను కనిపెట్టారు అని వారు అంటే.. దానికి కాలమే సమాధానం చెప్పాలి. చేయడం కన్నా చెప్పడం సులభం. మౌలిక సదుపాయాలు ఉన్న దేశాల గురించి మేము మాట్లాడుతున్నాము. ఏదైనా ప్రతికూల పరిస్థితి ఉంటే, తగిన హెచ్చరిక ఉంటుంది.

ప్ర. ప్రస్తుత పరిస్థితులు చూస్తే భారత్.. అమెరికా పక్షాన ఉంది అనుకోవచ్చా?

జ. మనం ఎవరి పక్షాన లేము. మనం ఏ దేశం వైపు ఉన్నట్లు పరిగణించటం లేదు. పరిస్థితుల ఆధారంగా మాత్రమే వైఖరిని నిర్ణయించుకుంటున్నాము. మనం ఎవరికీ వ్యతిరేకంగా, ఏ ఒక్కరి పక్షాన చేరలేదు.

ప్ర. మొదటి ఇండో-యూఎస్ త్రివిధ దళాల విన్యాసాలు, 2 + 2 చర్చలు ఈ సంవత్సరం జరగనున్నాయి. వీటికి ఎంత ప్రాముఖ్యం ఉంది?

జ. ఇది నవంబర్‌లో జరుగుతుంది. ఇరు దేశాలు అనుసరిస్తోన్న ఉత్తమ పద్ధతులను, నైపుణ్యాలను పరస్పరం పంచుకోవడమే దీని లక్ష్యం. భవిష్యత్​లో కలసి పనిచేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. కనుక భారత్​.. అమెరికాతో లేదా మరే దేశంతో చేస్తోన్న శిక్షణ విన్యాసాలు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండాలి. దీని వల్ల ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కాలం వృథా అవకుండా ఉంటుంది. కనుక రెండు దేశాలు కలసి సాధన చేస్తున్నాయి. పరస్పరం తమ విధానాలను పంచుకోవచ్చు.

ప్ర- మలబార్ శిక్షణా అభ్యాసం కాలం గడిచేకొద్ది ఎలా పరిణితి చెందింది? దీని వెనుక ఉన్న వ్యూహాత్మక సందేశం ఏమిటి?

జ. 'మలబార్' ప్రారంభమై దాదాపు రెండు దశాబ్దాలైంది. అమెరికా మాతో శిక్షణాభ్యాసం చేయడం ప్రారంభించినప్పుడు పరిస్థితులు వేరు. కొన్ని యుద్ధనౌకలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు ప్రపంచంలోనే అధునాతన అమెరికా యుద్ధనౌకలు ఇందులో పాల్గొంటున్నాయి. 1990లలో జరిగిన ఇండో-యూఎస్ ద్వైపాక్షిక మలబార్ అభ్యాసం అప్పటి నుంచి ఇరు దేశాల శిక్షణ కొనసాగుతోంది. చాలా స్పష్టంగా చెప్పాలంటే మనం వారితో ఎలాంటి పొత్తులో లేము. స్వతంత్ర దేశంగా వ్యవహరిస్తున్నాము. మనం వారి నుంచి చాలా నేర్చుకున్నాము. వారు కూడా మన నుంచి నేర్చుకున్నారు.

ఇది నైపుణ్యాల మార్పిడిగా చూడాలి. ఎన్నో సంవత్సరాలుగా మేము ఒకరితో ఒకరు ఎల్​ఈఎమ్​ఓఏ, సీఐఎస్​ఎమ్​ఓఏ వంటి ఒప్పందాల ఆధారంగా విశ్వాసంగా పనిచేస్తున్నాము. వీటి వల్ల భారత్​, యూఎస్ నావికాదళం శక్తిసామర్థ్యాలు పెరుగుతాయి.

ఇప్పుడు మనం విమానాలు, క్యారియర్లు, అణు నౌకలు గురించి మాట్లాడుతున్నాము. ఇండో-ఫసిఫిక్​ ప్రాంతంలో జరుగుతోన్న మార్పుల వల్ల మాపై బాధ్యత పెరుగుతోంది. అంటే అమెరికాపై మనపై ఎక్కువ నమ్మకం ఉంది. వారు దక్షిణ చైనా సముద్రం వైపు మళ్లారు. ప్రపంచంలోని ఈ భాగంలో ఉన్న అతిపెద్ద పవర్​ ఏంటో వారికి తెలుసు.

అందరికీ భద్రత, వృద్ధి గురించి ప్రధాని మోదీ పలుమార్లు మాట్లాడారు. అదేవిధంగా మనం ఈ ప్రాంతంలోని మొదటి ప్రతిస్పందనదారుగా మాట్లాడుతున్నాము. మనం ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నించడం లేదు. నావికా స్వేచ్ఛను కోరుకుంటున్నాము. ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి. హింసకు, మాదకద్రవ్యాల నుంచి ఈ ప్రాంతం స్వేచ్ఛను సాధించాలి.

ప్ర- నియంత్రణపై చైనాకు ఏమైనా సందేశం ఉందా?

జ. 2008లో సముద్ర దోపిడీలు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. భారత నావికాదళం.. గల్ఫ్​కు ఓడను పంపడం ప్రారంభించింది. 2012 నుంచి.. చైనా పీఎల్​ఏ నౌకలు 4-5 సమూహాలలో వస్తున్నాయి. వారు జలాంతర్గాములనూ పంపడం ప్రారంభించారు. జలాంతర్గాములు.. సముద్ర దోపిడీలను అరికట్టే ఆపరేషన్స్​ కోసం కాదని అందరికీ తెలుసు. వారు మన జలాలను మ్యాప్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జలాంతర్గామిని పట్టుకోవాలంటే నిర్దిష్ట డేటా అవసరం. అప్పుడు మన వాటిని ఉపయోగించి శత్రు జలాంతర్గాములు ఎక్కడ నక్కాయో కనిపెట్టొచ్చు. సముద్ర దోపిడీలను అరికట్టేందుకు అన్ని దళాలు కలసి ఐకమత్యంగా పోరాడాలి. అయితే మన ప్రాదేశిక జలాల్లో వారు ప్రవేశిస్తే తీవ్రమైన అభ్యంతరాలు ఉంటాయి.

ప్ర. హిందూ మహాసముద్రంలో భారత్​కు ఎదురయ్యే అతిపెద్ద సవాలేంటి?

జ. మనకు ఎలాంటి సవాళ్లు లేవు. ఇక్కడ మనమే పెద్ద పవర్​. కనుక హిందూ సముద్ర కార్యకలాపాలపై మనకు స్పష్టమైన అవగాహన ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సంభవించే ప్రమాదాలు, తుపానులు, భూకంపాల విషయంలో భారత నావికా దళమే తొలుత స్పందించింది. ఎందుకంటే మనం హిందూ సముద్రానికి దగ్గరగా ఉన్నాం. మాల్దీవులు, శ్రీలంక, మడగాస్కర్​, సీషెల్స్​, మారిషస్, బంగ్లాదేశ్, మయన్మార్​ ఇలా ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా వారికి భారత్​ అండగా ఉంటుంది. మనకు ఎలాంటి మోసపూరిత ఆలోచనలు లేవు. ఎవరిపైనా ఆక్రమణకు వెళ్లే ఉద్దేశం లేదు. చైనా తరహా ఆలోచనా విధానం భారత్​కు లేదు.

Jamshedpur (Jharkhand), Oct 08 (ANI): Chief Minister Raghubar Das visited Puja Pandal at Bhalubasa area of Jharkhand's Jamshedpur. CM Das attended the cultural programme at pandal which was hosted on the occasion of Maha Navami. Several cultural dance forms of Jharkhand were performed at the occasion.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.