ETV Bharat / bharat

ఇస్రో నుంచి నింగిలోకి.. ఇక ప్రైవేటు రాకెట్లు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సదుపాయాలను ప్రైవేటు సంస్థలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది కేంద్రం. శాటిలైట్, రాకెట్ ప్రయోగాల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది.

author img

By

Published : Jun 10, 2020, 5:53 AM IST

isro
ఇస్రో నుంచి నింగిలోకి.. ఇక ప్రైవేటు రాకెట్లు

భారత అంతరక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లోని సదుపాయాలు ను ప్రైవేటు సంస్థలకు అందుబాటులోకి రానున్నాయి. శాటిలైట్, రాకెట్ ప్రయోగాలు, అంతరిక్ష కార్యక్రమాల్లో ప్రైవేటు సంస్థలకు అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది కేంద్రం. గ్రహాలపై అన్వేషణ, అంతరిక్ష యాత్రలు ప్రైవేటు రంగంలోని వారికి అందుబాటులోకి రానున్నాయని చెప్పింది. ఈ మేరకు కేంద్ర అణుశక్తి, అంతరిక్ష కార్యక్రమ మంత్రి జితేంద్ర సింగ్ ప్రకటన విడుదల చేశారు.

లాక్​డౌన్​తో మందగమనంలో సాగుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో అంతరిక్ష ప్రయోగాల ప్రైవేటీకరణ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇస్రో సదుపాయాలను ప్రైవేటు రంగానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించారు మంత్రి.

గగన్​యాన్ తాత్కాలిక నిలిపివేత..

నలుగురు భారత వ్యోమగాములను అంతరిక్షం లోకి పంపే కార్యక్రమం గగన్​యాన్.. కరోనా పరిస్థితుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయిందని వెల్లడించారు జితేంద్ర సింగ్. అయితే వ్యోమగాములకు రష్యాలో శిక్షణ కొనసాగుతోందని చెప్పారు. 2022లో చేపట్టేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం కోసం రూ. 10,000 కోట్లు వెచ్చిస్తోంది భారత్.

ఇదీ చూడండి: 'చైనాతో సరిహద్దు అంశంపై మోదీ ప్రత్యక్ష పర్యవేక్షణ'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.