పంజాబ్ మోగాలో ఓ హెడ్ కానిస్టేబుల్ కుల్విందర్ సింగ్.. సొంత కుటుంబ సభ్యులనే కాల్చిచంపిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. భార్య, అత్త, బావమరిది, బావమరిది భార్యను ప్రభుత్వ ఏకే-47తో దారుణంగా కాల్చి చంపాడు.
కొద్ది రోజుల క్రితం అత్తగారి భూమిలో ఓ పందుల ఫాం పెట్టి వ్యాపారం మొదలెట్టాడు కుల్విందర్. ఆ భూమిని అత్త, బావమరిది తిరిగి అడిగినందుకు తీవ్రంగా ఆగ్రహించిన కుల్విందర్ తప్ప తాగి అత్తారింటికి వెళ్లాడు. మద్యం మత్తులో బావమరిదితో గొడవకు దిగాడు. ఉద్రేకంలో తన వద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపాడు.
ఘటనలో భార్య రాజ్విందర్ కౌర్, అత్త సుఖ్విందర్ కౌర్, బావమరిది జస్కరణ్ సింగ్, బావమరిది భార్య ఇంద్రజిత్ కౌర్ మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన జస్కరణ్ సింగ్ పదేళ్ల కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
క్షణికావేశంలో నలుగురు కుటుంబసభ్యులను హతమార్చి పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు కుల్విందర్. 2014లోనూ ఇలాగే అత్తగారింట్లో దాడికి పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి:ఔరా: చెక్క సైకిల్ ఎంత చక్కగా ఉందో చూశారా?